Horoscope Today: ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు
Horoscope Today, 13th July 2024: ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు
13-07-2024 (శనివారం)
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, కృష్ణ పక్షం
తిధి : సప్తమి మధ్యాహ్నం గం.3.05 ని.ల వరకు ఆ తర్వాత అష్టమి
నక్షత్రం: హస్త సాయంత్రం గం.7.15 ని.ల వరకు ఆ తర్వాత చిత్త
అమృతఘడియలు: మధ్యాహ్నం గం.12.28 ని.ల నుంచి గం.2.17 ని.ల వరకు
వర్జ్యం: రేపు తె.వా. గం.4.12 ని.ల నుంచి గం.5.59 ని.ల వరకు
దుర్ముహూర్తం : ఉదయం గం.5.49 ని.ల నుంచి గం.7.34 ని.ల వరకు
రాహుకాలం : ఉదయం గం.9.06 ని.ల నుంచి గం.10.44 ని.ల వరకు
సూర్యోదయం : తె.వా. గం.5.49 ని.లకు
సూర్యాస్తమయం : సా. గం.6.54 ని.లకు
మేషం :
చేపట్టిన కార్యాల్లో శుభ ఫలితాలను పొందుతారు. ధనలాభం ఉంటుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆత్మీయుల తోడ్పాటుతో సమస్య పరిష్కారమవుతుంది. కీర్తి పెరుగుతుంది. దైవకార్యాల్లో పాల్గొంటారు.
వృషభం :
సంతాన సంబంధ వ్యవహారాలు సజావుగా సాగవు. ఇరుగుపొరుగుతో చిక్కులొస్తాయి. అభీష్టం నెరవేరక పోవడం మనోవ్యధను కలిగిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. సాంత్వనకోసం గాయత్రీమాతను పూజించండి.
మిథునం :
డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. వృథా ఖర్చులు తగ్గించకుంటే అప్పులు చేయక తప్పదు. స్థిర, చరాస్తి సంబంధ వ్యవహారాలు నష్టాన్ని కలిగిస్తాయి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. సుబ్రహ్మణ్యుణ్ణి పూజించండి.
కర్కాటకం:
వ్యవహారాల్లో విశేష లాభాన్ని పొందుతారు. ఆదాయం పెంపు కోసం చేసే ప్రయత్నాల్లో సఫలమవుతారు. కొత్త వస్తువులను కొంటారు. స్వల్పకాలిక ప్రయాణం సూచిస్తోంది. ఆత్మీయుల కలయిక ఉత్తేజాన్నిస్తుంది.
సింహం :
అకారణ విరోధం గోచరిస్తోంది. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి. మాట నిలుపుకోని కారణంగా నిందలు పడతారు. ఎవరికీ పూచీగా ఉండకండి. వేళకు భోజనం ఉండదు. ఇష్టదైవాన్ని ప్రార్థించడం మేలు.
కన్య :
భాగ్యవంతంగా ఉంటుంది. ఆశించిన వివిధ ప్రయోజనాలను పొందుతారు. బాధ్యతల నిర్వహణలో చిత్తశుద్ధికి ప్రశంసలు పొందుతారు. అంతులేని ఆనందం కలుగుతుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు.
తుల :
బద్ధకాన్ని వదిలి పెట్టాలి. మిత్రుల సహకారంతో గొప్ప ఆపద నుంచి బయటపడతారు. బంధువుల పరామర్శకు ఆసుపత్రికి వెళ్లే సూచన ఉంది. వేళకు భోజనముండదు. సాంత్వన కోసం శివుణ్ణి ఆరాధించండి.
వృశ్చికం :
మనోభీష్టం నెరవేరుతుంది. రుణ విమోచన యత్నాలు అనుకూలిస్తాయి. శత్రుత్వాలు సమసిపోతాయి. చక్కటి సౌకర్యాలు సమకూరతాయి. శుభ కార్యాల గురించిన చర్చ జరుగుతుంది. ఆరోగ్యం బావుంటుంది.
ధనుస్సు :
ప్రతి కార్యమూ విజయవంతం అవుతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. మనశ్శాంతిగా ఉంటుంది.
మకరం :
బంధువులతో విరోధం గోచరిస్తోంది. వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందిస్తారు. త్వరగా అలసిపోతారు. వృథా ఖర్చులుంటాయి. దత్తాత్రేయుణ్ణి పూజించండి.
కుంభం :
అపోహలు తగాదాలకు దారితీస్తాయి. పైవారికి పితూరీలు చెబుతున్నారంటూ సహచరులపై దురభిప్రాయం ఏర్పడుతుంది. మనశ్శాంతి కరువవుతుంది. తలనొప్పి వేధిస్తుంది. సాంత్వనకు శనైశ్చరుడిని పూజించండి.
మీనం :
ఆనందంగా ఉంటారు. పనులు సవ్యంగా సాగుతాయి. వ్యవహార లాభం ఉంది. ఇంటి వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. బంధువులను కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.