Today Horoscope in Telugu: ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 31 July 2024

Today Horoscope in Telugu: ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 31 July 2024

Update: 2024-07-31 00:30 GMT

Today Horoscope in Telugu: ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 31 July 2024

31-07-2024 (బుధవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ రుతువు, కృష్ణ పక్షం

తిధి : ఏకాదశి మధ్యాహ్నం గం.3.55 ని.ల వరకు

నక్షత్రం: రోహిణి ఉదయం గం.10.12 ని.ల వరకు

అమృతఘడియలు: ఉదయం గం. 7.02 ని.ల నుంచి గం.8.37 ని.ల వరకు మళ్లీ అర్ధరాత్రి దాటాక గం.1.32 ని.ల నుంచి గం. 3.08 ని.ల వరకు

వర్జ్యం: మధ్యాహ్నం గం.3.51 నిల నుంచి గం.5.28 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.11.58 ని.ల నుంచి గం.12.50 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.12.14 ని.ల నుంచి గం.2.00 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 5.59 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం.6.49 ని.లకు


 మేషం :

అవరోధాలుంటాయి. ఇతరుల కారణంగా ఇబ్బందుల్లో పడతారు. కుటుంబంలోనూ చికాకులుంటాయి. ఎవరికీ పూచీలు ఇవ్వకండి. ఆస్తి విక్రయ ప్రయత్నాలు వద్దు. అనవసరంగా నిందలు భరించాల్సి వస్తుంది.


 వృషభం :

రోజంతా ఉత్సాహంగా గడుస్తుంది. ధన సంబంధ వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి. చక్కటి సౌకర్యాలు సమకూరతాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. విందులో పాల్గొంటారు. ఆరోగ్యం బావుంటుంది.


 మిథునం :

పనులు అనుకున్నట్లుగా సాగవు. ధననష్టం గోచరిస్తోంది. అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఇతరుల వ్యవహారాలు ఇబ్బందిని కలిగిస్తాయి. వేళకు భోజనం ఉండదు. మిత్రులతో విరోధం గోచిరస్తోంది జాగ్రత్త.


 కర్కాటకం:

ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. చక్కటి సౌకర్యాలు సమకూరుస్తారు. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆత్మీయులను కలుస్తారు. ఇంట్లోశుభ కార్యాలపై దృష్టి పెడతారు.


 సింహం :

అవరోధాలను అవలీలగా దాటేస్తారు. అభీష్టం నెరవేర్చుకుంటారు. డబ్బుకి ఇబ్బందేమీ ఉండదు. శత్రువులు వెనక్కి తగ్గుతారు. ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. ఉద్యోగులు అధికారుల మన్నన పొందుతారు. కీర్తి వృద్ధి ఉంది.


 కన్య :

కార్య నిర్వహణలో ఆచితూచి వ్యవహరించాలి. అయినవాళ్లే మీతో విభేదిస్తారు. అనవసర కలహాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు మితిమీరతాయి. శత్రువుల కదలికలపై కన్నేసి ఉంచండి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి.


 తుల :

పనులు సవ్యంగా సాగవు. ఆర్థికంగానూ ఒడుదుడుకులు ఉంటాయి. ఉద్యోగులు అధికారుల కోపానిక గురయ్యే సూచన ఉంది. దురాలోచనలకు దూరంగా ఉండండి. వేళకు భోజనం ఉండదు. కీళ్ల సమస్యలుంటాయి.


 వృశ్చికం :

అన్ని ప్రయత్నాలూ సఫలం అవుతాయి. ధన లాభం ఉంది. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబ చికాకులను తొలగిస్తారు. బంధువులను కలుస్తారు. ఇరుగు పొరుగుతో సత్సంబంధాలుంటాయి. ప్రయాణం లాభిస్తుంది.


 ధనుస్సు:

అభీష్టం నెరవేరుతుంది. స్వస్థాన ప్రాప్తి ఉంది. చేపట్టి ప్రతి కార్యంలో శుభ ఫలితాలను పొందుతారు. పోటీల్లో మీకే విజయం లభిస్తుంది. బంధువులు సహకరాస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. దైవకార్యాల్లో పాల్గొంటారు.


 మకరం :

పనులు సజావుగా సాగవు. డబ్బుకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. సంతాన సంబంధ వ్యవహారాలు చిరాకు పరుస్తాయి. అనవసర విరోధాలు వస్తాయి. కీలక సమయంలో ఆత్మీయుల సూచనలను పాటించడం మేలు.


 కుంభం :

బుద్ధి నిలకడగా ఉండదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. డబ్బుకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ప్రతి పనిలో అడ్డంకులు మానసిక ఒత్తిడికి గురిచేస్తాయి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆస్తి అమ్మే ప్రయత్నాలు వద్దు.


 మీనం :

రోజంతా ఉత్సాహంగా గడుపుతారు. అభీష్టం నెరవేరుతుంది. డబ్బుకి ఇబ్బంది ఉండదు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆత్మీయులను కలుస్తారు. సోదరుల సహకారం లభిస్తుంది. అగ్రిమెంట్లకు అనుకూలమైన రోజు.

Tags:    

Similar News