Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 30 July 2024

Today Horoscope in Telugu, 30 July 2024: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే. 12 రాశుల ఫలితాలు ఇలా.

Update: 2024-07-30 00:30 GMT

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 30 July 2024

(30-07-2024, మంగళవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ రుతువు, కృష్ణ పక్షం

తిధి : నవమి సాయంత్రం గం.5.55 ని.ల వరకు తర్వాత దశమి

నక్షత్రం: భరణి ఉదయం గం.10.55 ని.ల వరకు ఆ తర్వాత కృత్తిక

అమృతఘడియలు: ఉదయం గం.6.17 ని.ల నుంచి గం.7.50 ని.ల వరకు

వర్జ్యం: రాత్రి గం.10.39 ని.ల నుంచి అర్ధరాత్రి గం.12.13 ని.ల వరకు

దుర్ముహూర్తం : మధ్యాహ్నం గం.12.50 ని.ల నుంచి గం. 1.41 ని.ల వరకు మళ్లీ గం.3.24 ని.ల నుంచి గం.4.16 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.7.35 ని.ల నుంచి గం. 9.11 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 5.59 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.50 ని.లకు

మేషం :

అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి. ఆశించిన ఆర్థిక ప్రయోజనం నెరవేరుతుంది. విందుల్లో పాల్గొంటారు. పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు.

వృషభం :

అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండండి. అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తుంటారు. వ్యవహారాల్లో నష్టం గోచరిస్తోంది. మనసు కలతబారుతుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఖర్చులు తగ్గించాలి.

మిథునం :

అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఆదాయం లాభసాటిగా ఉంటుంది. చక్కటి సౌకర్యాలు సమకూరతాయి. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆత్మీయులతో విందుల్లో పాల్గొంటారు.

కర్కాటకం:

ప్రయత్నించిన కార్యం సఫలమవుతుంది. శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది. మంచి అవకాశాలు చేతికి అందుతాయి. శత్రుపీడ తొలగుతుంది. ఉద్యోగులకు పెద్దల మన్నలు లభిస్తాయి. మనశ్శాంతి ఉంటుంది.

సింహం :

పనులు అనుకున్నట్లుగా సాగవు. ఆర్థిక లావాదేవీలు నెమ్మదిస్తాయి. సంతానం తీరు చికాకు పెడుతుంది. దూర ప్రయాణాలు గోచరిస్తున్నాయి. శత్రువుల బెడద పెరుగుతుంది. ఉదర సంబంధ సమస్యలు ఉంటాయి.

కన్య :

నిర్దేశిత సమయంలో అనుకున్నట్లుగా సౌకర్యాలు సమకూరవు. ఇతరులపై దురభిప్రాయాలు ఏర్పడతాయి. స్వల్ప వాగ్వాదాలకు ఆస్కారం ఉంది. పనులు అయిష్టంగా చేస్తారు. జీర్ణ సంబంధ సమస్య ఉంటుంది.

తుల :

నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆర్థిక లావాదేవీలు సవ్యంగా సాగుతాయి. ధనలాభం ఉంది. కొత్త విషయాలు తెలుస్తాయి. విజ్ఞానాన్ని పెంచుకునేందుకు అనువైన రోజు. మానసిక ప్రశాంతతను పొందుతారు.

వృశ్చికం :

చేపట్టిన పనులన్నింటా విజయం లభిస్తుంది. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. మిత్రులు సహకరిస్తారు. కొత్త వస్తువులను కొంటారు. కీర్తి పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు.

ధనుస్సు :

పనుల్లో ఆటంకాలుంటాయి. బద్ధకించకుండా కష్టపడితే సానుకూలత ఏర్పడుతుంది. కీలక వ్యవహారాల్లో మీ తెలివితేటలకు గుర్తింపు లభించదు. చెడు ఆలోచనలు వస్తాయి. నిరాశ వద్దు. వాతసంబంధ సమస్యలుంటాయి.

మకరం :

ప్రతి పనిలోనూ జాప్యం తప్పదు. బుద్ధి నిలకడగా ఉండదు. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగవు. విద్యారంగంలోని వారు అప్రమత్తంగా ఉండాలి. వృథా ఖర్చులు తగ్గించాలి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి.

కుంభం :

అభీష్టం నెరవేరుతుంది. పనుల్లో శుభ ఫలితాలను పొందుతారు. ఆదాయం మెరుగవుతుంది. దాయాదుల సమస్య పరిష్కారం అవుతుంది. ప్రియమైన వారిని కలుస్తారు. ఆత్మవిశ్వాసం, ఆనందం పెరుగుతాయి.

మీనం :

వ్యవహార నష్టం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసర అపవాదులు ఎదురవుతాయి. ఇతరుల వల్ల సమస్యలొస్తాయి. కుటుంబంలోనూ చికాకులుంటాయి. వేళకు భోజనముండదు. ఖర్చు తగ్గించాలి.


Full View


Tags:    

Similar News