Horoscope Today in Telugu 29th August 2024: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే

Horoscope Today in Telugu 29th August 2024: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే

Update: 2024-08-29 00:30 GMT

Horoscope Today in Telugu 29th August 2024: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే

29-08-2024 (గురువారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షినాయనం, వర్ష రుతువు, కృష్ణ పక్షం

తిధి : ఏకాదశి అర్ధరాత్రి గం. 1.37 ని.ల వరకు ఆ తర్వాత ద్వాదశి

నక్షత్రం: ఆరుద్ర మధ్యాహ్నం గం.4.39 ని.ల వరకు ఆ తర్వాత పునర్వసు

అమృతఘడియలు: ఉదయం గం.6.20 ని.ల నుంచి గం.7.59 ని.ల వరకు

వర్జ్యం: రేపు తె.వా. గం.5.17 ని.ల నుంచి గం.6.59 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.10.12 ని.ల నుంచి గం.11.02 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.3.12 ని.ల నుంచి గం.4.02 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.1.51 ని.ల నుంచి గం.3.24 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.02 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.32 ని.లకు

మేషం :


కీలక వ్యవహారంలో సత్తాను చాటుతారు. ఆర్థిక లబ్ది చేకూరుతుంది. ఆలోచనలకు పదును పెడతారు. ఆధ్యాత్మిక అంశాల్లో ప్రేరణను పొందుతారు. ఆత్మధైర్యం వృద్ధి చెందుతుంది. మిత్రులు సహకరిస్తారు.

వృషభం : 


నోటిదురుసు వల్ల ఇబ్బందులొస్తాయి. ఇచ్చిన మాట నిలుపుకోని కారణంగా అవమానం ఎదురవుతుంది. బ్యాంక్ వ్యవహారాలు పెండింగ్ పడతాయి. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టాలి. కంటి సమస్యలుంటాయి.

మిథునం : 


అభీష్టం నెరవేరుతుంది. ధనలాభం ఉంది. మంచి సౌకర్యం సమకూరుతుంది. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. బంధువులను కలుస్తారు. విందుల్లో పాల్గొంటారు. ప్రయాణం లాభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

కర్కాటకం:


పనులకు అడుగడుగునా ఆటంకాలు వస్తాయి. ధననష్టం ఉంది. బంధువులతో సఖ్యత చెడుతుంది. మిత్రుల వైద్యం కోసం అప్పు చేయాల్సి వస్తుంది. అనవసర వ్యవహారాల్లో జోక్యం మంచిది కాదు. ప్రయాణాలు లాభించవు.

సింహం :


 కాలం ఆనందంగా సాగుతుంది. శుభకార్యాల్లో బంధువులను కలుస్తారు. సంతాన సంబంధ వ్యవహారాలు తృప్తినిస్తాయి. ఇతరుల సహకారం లభిస్తుంది. కొత్త వస్తువులను సేకరిస్తారు. మనశ్శాంతి లభిస్తుంది.

కన్య :


వృత్తిపరమైన అంశాలు సంతృప్తినిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. బంధువులతో వినోదాల్లో పాల్గొంటారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కొత్త బాధ్యతల్లో ప్రావీణ్యం కనబరుస్తారు.

తుల :


ఆశించిన రీతిలో పనులు సాగవు. వృథా ఖర్చులుంటాయి. ఉన్నత విద్యాప్రయత్నాల్లో జాప్యం ఏర్పడుతుంది. త్వరగా అలసిపోతారు. వైద్యానికి ఖర్చు చేస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.

వృశ్చికం :


 శత్రుపీడ పెరుగుతుంది. ప్రతి పనిలోనూ చిక్కులను పరిష్కరించాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగవు. ఇతరులపై దురభిప్రాయం ఏర్పడుతుంది. చెప్పుడు మాటలు వినకండి. తగాదాలు వద్దు.

ధనుస్సు :


 ఆనందంగా గడుస్తుంది. ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. బంధుమిత్రులను కలుస్తారు. బంధుత్వాలు బలపడతాయి. సంతాన సంబంధ శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. మనశ్శాంతిని పొందుతారు.

మకరం :


 అన్ని వ్యవహారాల్లో శుభ ఫలితాలను పొందుతారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. కొత్త వస్తువులను కొంటారు. సందేహాలు తీరతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బావుంటుంది.

కుంభం :


బద్ధకాన్ని వదిలి పనిచేయాలి. కీలక నిర్ణయాల్లో ఆత్మీయుల సూచనలు పాటించండి. ప్రేమ వ్యవహారాలు బెడిసికొడతాయి. శిక్షణ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. విశ్లేషణలు ఫలితాన్నివ్వవు.

మీనం :


పనికి అడ్డంకులొస్తాయి. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో జాగ్రత్త. మాతృసంబంధీకుల గురించిన వర్తమానం అందుతుంది. మిత్రుల వ్యవహారాల్లో తొందరపాటు వద్దు. మనసు నిలకడగా ఉండదు.

Tags:    

Similar News