Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 29 July 2024

Today Horoscope in Telugu, 29 July 2024: ఈరోజు ఎవరికి ఎలా ఉంటుంది? ఎవరికి కలిసొస్తుంది? ఎవరికి సమస్యలు పొంచి ఉన్నాయి? ఈ రోజు 12 రాశి ఫలాలపై జ్యోతిష్య పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం.

Update: 2024-07-29 00:30 GMT

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 29 July 2024

29-07-2024 (సోమవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, కృష్ణ పక్షం

తిధి: నవమి సాయంత్రం గం.5.55 ని.ల వరకు తర్వాత దశమి

నక్షత్రం: భరణి ఉదయం గం.10.55 ని.లకు ఆ తర్వాత కృత్తిక

అమృతఘడియలు: ఉదయం గం.6.17 ని.ల నుంచి గం.7.50 ని.ల వరకు

వర్జ్యం: రాత్రి గం.10.39 ని.ల నుంచి అర్ధరాత్రి గం.12.13 ని.ల వరకు

దుర్ముహూర్తం: మధ్యాహ్నం గం.12.48 ని.ల నుంచి గం.1.40 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.3.24 ని.ల నుంచి గం. 4.15 ని.ల వరకు

రాహుకాలం: ఉదయం గం.7.32 ని.ల నుంచి గం.9.09 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 5.55 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం. 6.50 ని.లకు

మేషం 

బ్యాంకు లావాదేవీలు ఆశించినట్లుగా ఉండవు. ఆర్థిక వ్యవహారాల్లో జాప్యం ఉంటుంది. ఇతరుల వల్ల ఇబ్బందులు వస్తాయి. మీ వినయాన్ని బలహీనంగా భావిస్తారు. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకండి.

వృషభం 

పనుల నిర్విఘ్నంగా జరుగుతాయి. ధనలాభం ఉంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మీ కార్యదక్షతకు ప్రశంసలు అందుతాయి. అన్ని రంగాల్లోని వారికీ అనుకూలమైన రోజిది. కుటుంబ సౌఖ్యాన్నీ పొందుతారు.

మిథునం 

వ్యర్థ ప్రయాణాలుంటాయి. పనులకు ఆటంకాలొస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. బంధువులతో విరోధం గోచరిస్తోంది. వైద్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. మనశ్శాంతి కరువవుతుంది.

కర్కాటకం

అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక ప్రయోజనాలు ఆశించినట్లే సమకూరతాయి. తెలిసినవారు సహకరిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

సింహం

పనులన్నిటా విజయం లభిస్తుంది. ధన సంబంధ చికాకులు తొలగుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగులు అధికారుల మెప్పును పొందుతారు. ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. విందుల పాల్గొంటారు.

కన్య

పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. దూర ప్రాంతానికి వెళ్లే సూచన ఉంది. సంతానం తీరు చికాకు పరుస్తుంది. స్వజనులతోనూ విరోధం గోచరిస్తోంది. వృథా ఖర్చులను అదుపు చేయండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి.

తుల

అనుకున్న రీతిలో పనులు సాగవు. ఆర్థికంగానూ ఏమంత బావుండదు. ఇతరులపై దురభిప్రాయాలు ఏర్పడతాయి. ఆలోచనలు వక్రమార్గాన సాగుతాయి. ఉద్రేకాన్ని అదుపు చేయండి. తగాదాలు వద్దు.

వృశ్చికం

పనులు సవ్యంగా సాగుతాయి. ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రయాణాలు ఆనందంగా సాగుతాయి. ఇతరులతో సత్సంబంధాలుంటాయి.

ధనుస్సు

చేపట్టిన పని విజయవంతం అవుతుంది. ధనలాభం ఉంది. స్వస్థాన ప్రాప్తి గోచరిస్తోంది. కీర్తి పెరుగుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. శుభ కార్యాలకు శ్రీకారం చుడతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

మకరం

పనులకు ఆటంకాలుంటాయి. అభీష్టం నెరవేరేందుకు బాగా శ్రమించాల్సి వుంటుంది. బద్ధకాన్ని వీడండి. వృథా ఖర్చులు చికాకు పెడతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచండి.

కుంభం

ప్రతి పనిలో అడ్డంకులుంటాయి. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. బుద్ధి నిలకడగా ఉండదు. తొందరపాటు నిర్ణయాల వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఆత్మీయులతోనూ విరోధం వస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది.

మీనం

పనులు విజయవంతం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఆత్మీయులను కలుస్తారు. మానసిక సౌఖ్యాన్ని పొందుతారు. మిత్రులు తోడుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

Tags:    

Similar News