Telugu Horoscope Today 28th August 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

Telugu Horoscope Today 28th August 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

Update: 2024-08-28 00:30 GMT

Telugu Horoscope Today 28th August 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

28-08-2024 (బుధవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, కృష్ణ పక్షం

తిధి : దశమి అర్ధరాత్రి గం.1.19 ని.ల వరకు ఆ తర్వాత ఏకాదశి

నక్షత్రం: మృగశిర మధ్యాహ్నం గం.3.53 ని.ల వరకు ఆ తర్వాత ఆరుద్ర

అమృతఘడియలు: ఉదయం గం.6.59 ని.ల నుంచి గం.8.36 ని.ల వరకు

వర్జ్యం: అర్ధరాత్రి గం.12.33 ని.ల నుంచి గం.2.12 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.11.52 ని.ల నుంచి గం. 12.42 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.12.17 ని.ల నుంచి గం. 1.51 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.02 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.33 ని.లకు

మేషం :


అగ్రిమెంట్లకు అనుకూలం. రాజీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. కీలక సందర్భంలో ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. నాయకత్వ పటిమకు ప్రశంసలు వస్తాయి. తోటివారితో సఖ్యత ఏర్పడుతుంది.

వృషభం : 


లక్ష్యసాధన అంత సులువు కాదు. ఆర్థిక లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అకారణ విరోధాలు వస్తాయి. జీవిత భాగస్వామితో గొడవలు మంచిది కాదు. ముందు చూపు లేక సమస్యల్లో పడతారు.

మిథునం : 


అన్ని వేళలా అదృష్టం తోడుగా ఉంటుంది. అభీష్టం నెరవేరుతుంది. కుటుంబ సౌఖ్యం పొందుతారు. బంధువుల నుంచి ప్రశంసలను అందుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. విందులో పాల్గొంటారు.

కర్కాటకం:


 అప్రమత్తంగా మెలగండి. ఆర్థిక చిక్కులు వేధిస్తాయి. బద్ధకాన్ని వదిలిపెట్టండి. దూర ప్రయాణం గోచరిస్తోంది. మిత్రుల వైద్యానికి ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒంటరితనాన్ని కోరుకుంటారు. కోర్టు కేసుల్లో నిర్లక్ష్యం వద్దు.

సింహం :


 శుభకార్యాల నిర్వహణకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రులు సహకరిస్తారు. ఆర్థిక చిక్కులు తగ్గుతాయి. కొత్త పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. సంతానం గురించి శుభవార్తను వింటారు. ఆరోగ్యం బావుంటుంది.

కన్య :


అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. వృత్తి నిపుణతకు గుర్తింపు లభిస్తుంది. అధికారుల మెప్పును పొందుతారు. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. విందులో పాల్గొంటారు.

తుల :


ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. డబ్బు విషయాల్లో తొందరపాటు వద్దు. ఉన్నత విద్యాయత్నం ముందుకు సాగదు. అశాంతికి గురవుతారు. ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సందర్శిస్తారు. గురువుల సూచన మేలు చేస్తుంది.

వృశ్చికం :


 నిర్దేశిత సమయానికి పనులు కావు. ప్రతిచోటా వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఆర్థికంగానూ ఇక్కట్లుంటాయి. అధికారులు, పెద్దల కోపానికి గురవుతారు. తగాదాలకు దూరంగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.

ధనుస్సు :


 శుభప్రదంగా సాగుతుంది. అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణం లాభిస్తుంది. బంధువులను కలుస్తారు. జీవిత భాగస్వామి సూచన పాటించండి.

మకరం :


కార్యజయం ఉంది. ధన సంబంధ వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. కొత్త వస్తువులను సేకరిస్తారు. బలహీనతలను అధిగమిస్తారు. ఆరోగ్యం మెరుగవుతుంది. పోటీదారులపై విజయం సాధిస్తారు. కీర్తి పెరుగుతుంది.

కుంభం :


కీలక సమయంలో మీ మేధస్సు ఉపకరించదు. ఆర్థిక చికాకులుంటాయి. ఆలోచనలు వక్రగతిలో సాగుతాయి. నైపుణ్యం పెంచుకోవాల్సి వస్తుంది. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. వాత సంబంధ సమస్య వేధిస్తుంది.

మీనం :


 పనులు సవ్యంగా కావు. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. బంధువులతోనూ సఖ్యత చెడుతుంది. రహస్య వ్యవహారాలు రట్టయ్యే సూచన ఉంది. సమర్థించేవారు దూరమవుతారు. ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణంలో జాగ్రత్త.

Tags:    

Similar News