Horoscope Today in Telugu 27th August 2024: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే

Horoscope Today in Telugu 27th August 2024: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే

Update: 2024-08-27 00:30 GMT

Horoscope Today in Telugu 27th August 2024: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే

27-08-2024 (మంగళవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, కృష్ణ పక్షం

తిధి : నవమి అర్ధరాత్రి దాటాక గం.1.33 ని.ల వరకు ఆ తర్వాత దశమి

నక్షత్రం: రోహిణి మధ్యాహ్నం గం.3.38 ని.ల వరకు ఆ తర్వాత మృగశిర

అమృతఘడియలు: మధ్యాహ్నం గం.12.28 ని.ల నుంచి గం.2.03 ని.ల వరకు

వర్జ్యం: ఉదయం గం.7.43 ని.ల నుంచి గం. 9.18 ని.ల వరకు మళ్లీ రాత్రి గం.9.17 ని.ల నుంచి గం.10.54 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.8.22 ని.ల నుంచి గం. 9.22 ని.ల వరకు మళ్లీ గం.11.09 ని.ల నుంచి గం.11.55 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.3.25 ని.ల నుంచి గం.4.59 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.01 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం.6.33 ని.లలకు

మేషం :


ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. అడుగడుగునా ఆటంకాలు వస్తాయి. మాట పలుకుబడి తగ్గుతుంది. అనవసర విరోధాలకు ఆస్కారం ఉంది. వేళకు భోజనం ఉండదు. విలువైన వస్తువులు జాగ్రత్త. కుటుంబంపై శ్రద్ధ పెట్టండి.

వృషభం :


అదృష్టం తోడుగా ఉంటుంది. అభీష్టం నెరవేరుతుంది. ధన సంబంధ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. నూతన విజ్ఞానం పొందేందుకు అనువైన రోజు. తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. మానసిక స్థితి ఉత్సాహంగా ఉంటుంది.

మిథునం :


 ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్త. బద్ధకం వల్ల సమస్యలు పెరుగుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. నిద్ర లేమి వేధిస్తుంది. అవమానాలకు ఆస్కారముంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

కర్కాటకం:


కార్యజయం ఉంది. మంచి సౌకర్యాలు సమకూరతాయి. పరిచయాలు వృద్ధి చెందుతాయి. మిత్రుల కారణంగా లబ్దిని పొందుతారు. ఆకాంక్ష నెరవేరుతుంది. పెద్దవారి ఆశీస్సులు పొందుతారు. విందులో పాల్గొంటారు.

సింహం :


 రోజంతా శుభప్రదంగా సాగుతుంది. చేపట్టిన ప్రతి పనీ సఫలం అవుతుంది. పొటీల్లో విజేతలుగా నిలుస్తారు. ఉద్యోగులకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది.

కన్య :


 పనులు ఆశించిన విధంగా కాకున్నా, సఫలమవుతాయి. బాధ్యతల నిర్వహణపై శ్రద్ధ పెంచండి. దూర ప్రయాణం గోచరిస్తోంది. బంధువులతో విరోధం ఉంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్త. గురువులపై గౌరవాన్ని చూపుతారు.

తుల :


మనసుకి కష్టంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో తొందరపాటు వద్దు. ఉద్యోగులకు సహచరులతో విబేదాలు వస్తాయి. పోటీల్లో పరాజయం సూచిస్తోంది. ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది. వేళకు భోజనముండదు.

వృశ్చికం :


 ఆర్థిక లాభం ఉంది. సంబంధాలు దృఢపడతాయి. నిజాయితీగా మీరు ఆకాంక్షించే స్వేచ్ఛను ఆస్వాదిస్తారు. బంధువులు సహకరిస్తారు. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. కొత్త విషయాలను గ్రహిస్తారు. ఆనందంగా గడుపుతారు.

ధనుస్సు :


 విజయవంతంగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మిత్రులు తోడ్పడతారు. బలహీనతలను అధిగమిస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. న్యాయవివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి.

మకరం :


 అనుకున్న రీతిలో పని జరగదు. ఆటంకాలు దాటాలి. మీ తెలివితేటలు రాణించవు. ఆలోచనలు వక్రగతిన సాగుతాయి. ఆర్థిక చికక్కుంటాయి. ముందుచూపు లేమి వల్ల ఇబ్బంది పడతారు. బద్ధకాన్ని వదిలి పెట్టాలి.

కుంభం :


డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. పనులు అనుకున్నట్లు సాగక ఒత్తిడి పెరుగుతుంది. తల్లికి అంత మంచి రోజు కాదు. మాతృసంబంధీకులతో విభేదాలు వస్తాయి. ఆలోచన విధానం మారుతుంది. స్థిరాస్తి వ్యవహారాలు లాభించవు.

మీనం :


 విజయం సిద్ధిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. మానసిక సౌఖ్యం పొందుతారు. కొత్త వస్తువులను సేకరిస్తారు. ప్రియతములను కలవడం ఉత్తేజాన్నిస్తుంది. తోబుట్టువులు తోడుంటారు. ఇరుగుపొరుగుతో సఖ్యత ఉంటుంది.

Tags:    

Similar News