Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 27 July 2024

Today Horoscope in Telugu, 27 July 2024: ఈరోజు ఎవరికి ఎలా ఉంటుంది? ఎవరికి కలిసొస్తుంది? ఎవరికి సమస్యలు పొంచి ఉన్నాయి? ఈ రోజు 12 రాశి ఫలాలపై జ్యోతిష్య పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం.

Update: 2024-07-27 00:30 GMT

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 27 July 2024

(27-07-2024, శనివారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, కృష్ణ పక్షం

తిధి: సప్తమి రాత్రి గం.9.19 ని.ల వరకు ఆ తర్వాత అష్టమి

నక్షత్రం: రేవతి మధ్యాహ్నం గం. 1.00 నిల వరకు, ఆ తర్వాత అశ్వని

అమృతఘడియలు: ఉదయం గం.10.45 ని.ల నుంచి గం.12.15 ని.ల వరకు మళ్లీ అర్ధరాత్రి దాటాక తె.వా.గం.4.57 ని.ల నుంచి గం.6.28 ని.ల వరకు

వర్జ్యం: ..

దుర్ముహూర్తం: ఉదయం గం.5.58 ని.ల నుంచి గం.7.41 ని.ల వరకు

రాహుకాలం: ఉదయం గం.9.11 ని.ల నుంచి గం.10.48 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 5.58 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం.6.51 ని.లకు

మేషం

ఆటంకాలను అధిగమించి అభీష్టం నెరవేర్చుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు అనుకున్నట్లే సాగుతాయి. ఆత్మీయులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారు. వృథా ఖర్చులు తగ్గించండి. బద్ధకాన్ని వదిలిపెట్టండి.

వృషభం

లక్ష్యాన్ని సాధిస్తారు. సహచరుల తోడ్పాటు లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. మధ్యాహ్నం తర్వాత అనూహ్య ఘటనలు మనసుని కలత బారుస్తాయి.

మిథునం

అన్ని పనులూ అనుకూలంగా సాగుతాయి. డబ్బు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఉపకరిస్తాయి. సంతాన సంబంధ వ్యవహారాలు తృప్తినిస్తాయి.

కర్కాటకం

అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక ప్రయోజనం నెరవేరుతుంది. సంతానం తీరు కాస్త చికాకు పరిచినా, వారి పురోగతి తృప్తినిస్తుంది. ఉద్యోగులకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది.

సింహం

అన్ని సందర్భాల్లో అప్రమత్తంగా ఉండండి. మీ చర్యలు అధికారులకు కోపాన్ని తెప్పించే వీలుంది. బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి రావచ్చు. అశాంతి ఏర్పడుతుంది. జీర్ణ సంబంధ సమస్య వస్తుంది. ఖర్చు తగ్గించండి.

కన్య

కార్యసాధనలో ఒడుదుడుకులుంటాయి. ఇరుగుపొరుగు సమస్యలు జీవిత భాగస్వామి చొరవతో పరిష్కారం అవుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. వినోదంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా ఉంటాయి.

తుల

ఆటంకాలను తేలిగ్గా అధిగమిస్తారు. చేపట్టిన పనుల్లో శుభ ఫలితాల పొందుతారు. బద్ధకిస్తే చిక్కులు తప్పవు. వృథా ఖర్చులను తగ్గించాలి. కీలక వ్యవహారంల మిత్రుల సహకారం ఉపకరిస్తుంది. ఆరోగ్యం బావుంటుంది.

వృశ్చికం

ప్రతి పనికీ అడ్డంకులుంటాయి. దీనికి బద్ధకం తోడైతే ఇబ్బందులొస్తాయి. సంతాన వ్యవహారాలు కలవర పరుస్తాయి. అవమానాలకు ఆస్కారం ఉంది. ఇతరుల వల్ల విరోధాలొస్తాయి. విలువైన వస్తువులు జాగ్రత్త.

ధనుస్సు

పనులు సవ్యంగా సాగుతాయి. ధైర్యసాహసాలు, ఆత్మవిశ్వాసంతో కార్యాల్లో శుభ పలితాలను పొందుతారు. అనవసరపు హామీలు ఇవ్వకండి. విరోధాలకు దూరంగా ఉండండి. బ్యాంకు వ్యవహారాలు సజావుగా సాగవు.

మకరం

శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. అవసరానికి సరిపడా డబ్బుంటుంది. ఇతరుల వల్ల ఇబ్బందులొచ్చే సూచన ఉంది. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి. అదృష్టం తోడవుతుంది. విందుల్లో పాల్గొంటారు.

కుంభం

సమస్యలెదురైనా అభీష్టం నెరవేరుతుంది. ధైర్యంతో పరిస్థితులను ఎదుర్కొంటారు. బుద్ధి కుశలత ఉపయోగ పడుతుంది. సోదరుల అండ లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యం బావుంటుంది.

మీనం

చేపట్టిన పని సజావుగానే పూర్తవుతుంది. ధనలాభం ఉంది. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. బ్యాంకు లావాదేవీలు నెమ్మదిగా సాగుతాయి. కుటుంబ చికాకులను పరిష్కరిస్తారు. కీలకవేళ అదృష్టం తోడవుతుంది.

Tags:    

Similar News