Telugu Horoscope Today 24th August 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

Telugu Horoscope Today 24th August 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

Update: 2024-08-24 00:30 GMT

Telugu Horoscope Today 24th August 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, కృష్ణ పక్షం

తిధి : పంచమి ఉదయం గం.7.51 ని.ల వరకు ఆ తర్వాత షష్ఠి రేపు తె.వా.గం.5.30 ని.ల వరకు

నక్షత్రం: అశ్వని సాయంత్రం గం.6.05 ని.ల వరకు ఆ తర్వాత భరణి

అమృతఘడియలు: ఉదయం గం.11.26 ని.ల నుంచి మ. గం.12.55 ని.ల వరకు

వర్జ్యం: మధ్యాహ్నం గం.2.24 ని.ల నుంచి గం.3.52 ని.ల వరకు మళ్లీ అర్ధరాత్రి దాటాక గం.3.09 ని.ల నుంచి గం.4.40 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.6.01 ని.ల నుంచి గం.7.42 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.9.10 ని.ల నుంచి గం.10.44 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.01 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం.6.36 ని.లకు

మేషం :


ఆకాంక్ష నెరవేరుతుంది. ఆస్తి వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. సత్ప్రవర్తనతో పెద్దల మనసులు గెలుస్తారు. మీ తెలివితేటలకు చక్కని గుర్తింపు లభిస్తుంది. గృహోపకరణాలు కొంటారు. అదృష్టం తోడవుతుంది.

వృషభం : 


పని పూర్తికి బాగా శ్రమించాల్సి వుంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో నష్టం గోచరిస్తోంది. మిత్రులతోనూ విభేదాలు వచ్చే వీలుంది. ఏకాంతాన్ని ఇష్టపడతారు. అన్ని సందర్భాల్లోనూ జాగ్రత్తగా నడచుకోవాలి.

మిథునం : 


పనులు, అనుకున్న రీతిలోనే సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. పోటీదారులపై విజయం సాధిస్తారు. ఇంటి వ్యవహారాలపై శ్రద్ధ పెడతారు. సంతాన సంబంధ వ్యవహారాలు మనశ్శాంతినిస్తాయి.

కర్కాటకం:


 కార్యాలన్నింట్లోనూ అనుకూల ఫలితాలు వస్తాయి. ధన సంబంధ విషయాలు సజావుగా సాగుతాయి. మీ సామర్థ్యానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. పోటీదారులపై గెలుస్తారు. ఆరోగ్యం బావుంటుంది.

సింహం :


 కీలక నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల్లో తొందరపాటు వద్దు. ఇంట్లో సంతానం తీరు అశాంతిని కలిగిస్తుంది. వీలైనంత వరకు కలహాలకు దూరంగా ఉండండి. గురుతుల్యులను కలవడం ఆనందాన్నిస్తుంది.

కన్య :


నిర్దిష్ట సమయానికి పనులు కావు. ఆర్థిక వ్యవహారాలు చికాకు పెడతాయి. అపోహలు దురాలోచనలకు కారణమవుతాయి. ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది. వాదనలు వద్దు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త.

తుల :


 రోజంతా వినోదాత్మకంగా సాగుతుంది. ధన సంబంధ వ్యవహారాలు తృప్తినిస్తాయి. మిత్రులతో పాటు, ఇతరులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణాలు యోగిస్తాయి. శారీరక, మానసిక ఆనందాన్ని పొందుతారు.

వృశ్చికం :


 చేపట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. ధనలాభం ఉంది. బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త వస్తువులను సేకరిస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. అపార్థాలు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి.

ధనుస్సు :


 ఆటంకాలు అధిగమించాల్సి వుంటుంది. అభీష్టం నెరవేరదు. ఆర్థిక వ్యవహారాలు మనోవ్యధకు కారణం అవుతాయి. తెలివితేటలకు గుర్తింపు ఉండదు. నీచపు ఆలోచనలు వద్దు. సామర్థ్యంపై నమ్మకంతో ముందుకు సాగండి.

మకరం : 


 భూ సంబంధ వ్యవహారాలు నష్టదాయకంగా ఉంటాయి. అయినవారితోనూ విభేదాలొస్తాయి. రహస్యాలు బయటపెట్టకండి. మనసు నిలకడగా ఉండదు. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త.

కుంభం :


 కార్యజయం ఉంది. అన్నివర్గాల నుంచీ సహకారం అందుతుంది. సాహసంతో చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి. సోదరులు తోడుంటారు. స్వశక్తితో అభీష్టాన్ని నెరవేర్చుకుంటారు. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి.

మీనం :


 ఆటంకాలు పెరుగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. మాట నిలుపుకోని కారణంగా నింద వస్తుంది. కుటుంబంలో చికాకులుంటాయి. ముందు చూపు లేకుండా చేసే పనుల వల్ల చిక్కుల్లో పడతారు.

Tags:    

Similar News