Telugu Horoscope Today 23rd August 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

Telugu Horoscope Today 23rd August 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

Update: 2024-08-23 00:30 GMT

Telugu Horoscope Today 23rd August 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

23-08-2024 (శుక్రవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, కృష్ణ పక్షం

తిధి : చవితి ఉదయం గం.10.38 ని.ల వరకు ఆ తర్వాత పంచమి

నక్షత్రం: రేవతి రాత్రి గం.7.54 ని.ల వరకు ఆ తర్వాత అశ్వని

అమృతఘడియలు: సాయంత్రం గం.5.43 ని.ల నుంచి గం.7.10 ని.ల వరకు

వర్జ్యం: ఉదయం గం.9.00 ని.ల నుంచి గం.10.27 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.8.32 ని.ల నుంచి గం.9.22 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.12.44 ని.ల నుంచి గం.1.34 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.10.44 ని.ల నుంచి గం.12.19 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.01 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.36 ని.లకు

మేషం :


ఇంటికి దూరంగా ఉంటారు. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం వద్దు. ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి. వృథా ఖర్చులు తగ్గించాలి. రహస్యాలు దాచాల్సివుంటుంది. జాగ్రత్త. బంధువులతో విరోధం ఉంది. బద్ధకం వద్దు.

వృషభం : 


రుణ వ్యహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆకాంక్షలు నెరవేరతాయి. ఖరీదైన వస్తువులను సేకరిస్తారు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో వినోదాల్లో పాల్గొంటారు. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి.

మిథునం : 


చాకచక్యంగా పనిచేస్తారు. స్థిర నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. అధికార వృద్ధి ఉంది. పోటీల్లో విజయం సాధిస్తారు. గౌరవం వృద్ధి చెందుతుంది. దూర ప్రాంతాల్లో స్థిరనివాసానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

కర్కాటకం:


పనులకు ఆటంకాలుంటాయి. ఉన్నత విద్యపై ఆసక్తి ఏర్పడగుతుంది. సంతానంతో విభేదిస్తారు. దైవచింతన పెరుగుతుంది. తీర్థయాత్రలకు అనుకూలం. గురువులను సేవిస్తారు. ఎముకల సంబంధ సమస్యలుంటాయి.

సింహం :


బలహీనతల వల్ల ఇబ్బంది పడతారు. పనులు సవ్యంగా సాగవు. ఆర్థిక చికాకులు ఏర్పడతాయి. శత్రుపీడ పెరుగుతుంది. పరిశోధన రంగంలోని వారు అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కన్య :


 ఆకాంక్ష నెరవేరుతుంది. అంతర్గత ఆనందం పెరుగుతుంది. నూతన వస్తువులను సేకరిస్తారు. కుటుంబ వ్యవహారంలో జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. మానసిక, శారీరక సౌఖ్యాలను పొందుతారు.

తుల :


 అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. దుర్వ్యసనాల నుంచి బయటపడే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పోటీల్లో గెలుస్తారు. బంధువుల తోడ్పాటు లభిస్తుంది. నూతన వస్తువులను సమకూర్చుకుంటారు. కీర్తి పెరుగుతుంది.

వృశ్చికం :


 ఆటంకాలున్నీ అధిగమిస్తారు. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగవు. ఆలోచనలు పెడదారిన పడతాయి. కీలక వేళల్లో మిత్రుల సూచనలు పాటించండి. అనవసర ఆందోళనలను వదిలిపెట్టాలి. విలువైన వస్తువులు జాగ్రత్త.

ధనుస్సు :


 ధన సంబంధ ఇబ్బందులుంటాయి. బుద్ధి నిలకడగా ఉండదు. స్వజనులతోనే విరోధం ఏర్పడుతుంది. పనులు నిరాశాజనకంగా సాగుతాయి. మనశ్శాంతి కరువవుతుంది. సహచరుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతుంది.

మకరం :


 సహోద్యోగులతో సఖ్యత పెరుగుతుంది. ఆశించిన ప్రయోజనాలు నెరవేరతాయి. ఆర్థిక లావాదేవీలు బావుంటాయి. నాయకత్వ లక్షణాలను చూపుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

కుంభం :


 మనసులోని మాటను స్పష్టంగా చెప్పలేక ఇబ్బంది పడతారు. బ్యాంకు లావాదేవీలు నష్టదాయకంగా ఉంటాయి. ముందుచూపు లేమి వల్ల సమస్యలు వస్తాయి. అకారణ విరోధం గోచరిస్తోంది. వేళకు భోజనం ఉండదు.

మీనం :


 ఉన్నత స్థితిని కాంక్షించి చేసే పనులు సఫలం అవుతాయి. డబ్బుకి ఇబ్బంది ఉండదు. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. నిరుద్యోగులకు మేలైన రోజు. జన్మస్థలం గురించిన చర్చ జరుగుతుంది. వాహనయోగం ఉంది.

Tags:    

Similar News