Today Horoscope in Telugu 16th August 2024: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే

Today Horoscope in Telugu 16th August 2024: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే

Update: 2024-08-16 00:30 GMT

Today Horoscope in Telugu 16th August 2024: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే

16-08-2024 (శుక్రవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, శుక్ల పక్షం

తిధి : ఏకాదశి ఉదయం గం.9.39 ని.ల వరకు ఆ తర్వాత ద్వాదశి

నక్షత్రం: మూల మధ్యాహ్నం గం.12.44 ని.ల వరకు ఆ తర్వాత పూర్వాషాఢ

అమృతఘడియలు: ఉదయం గం.6.22 ని.ల నుంచి గం.7.57 ని.ల వరకు

వర్జ్యం: ఉదయం గం.11.08 ని.ల నుంచి గం.12.44 ని.ల వరకు మళ్లీ రాత్రి గం.9.58 ని.ల నుంచి గం.11.30 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.8.32 ని.ల నుంచి గం.9.23 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.12.46 ని.ల నుంచి గం.1.36 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.10.45 ని.ల నుంచి గం.12.20 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 5.59 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.41 ని.లకు

మేషం :


పనుల్లో జాప్యం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగవు. సంతానం తీరు ఆందోళన కలిగిస్తుంది. సంప్రదాయిక జీవనంపై ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త. దూర ప్రయాణం గోచరిస్తోంది.

వృషభం :


అనుకున్న రీతిలో పనులు సాగవు. సదుపాయాలు కూడా సమకూరవు. ఆర్థిక చిక్కులుంటాయి. పోటీలకు దిగకండి. ఇతరులపై దురభిప్రాయం ఏర్పడుతుంది. పెద్దల ఆగ్రహానికి గురవుతారు. జీర్ణ సమస్యలుంటాయి.

మిథునం :


 అన్ని ప్రయత్నాలు సఫలం అవుతాయి. ధనలాభం ఉంది. శారీరక, మానసిక ఆనందాన్ని పొందుతారు. కొత్త విషయాలను గ్రహిస్తారు. ప్రయాణాలు ఆనందకరంగా ఉంటాయి. బంధుత్వాలు బలపడతాయి. విందులో పాల్గొంటారు.

కర్కాటకం:


 ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది. స్వస్థాన ప్రాప్తి ఉంది. మిత్రుల సహకారం లభిస్తుంది. మానసిక చికాకులు తొలగిపోతాయి. పోటీల్లో విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

సింహం :


 ఆటంకాలు ఎదురవుతాయి. పరిణామాలు వేదనకు కారణమవుతాయి. ప్రేమ వ్యవహారాలు బెడిసి కొడతాయి. బద్ధకం వదిలి పెట్టాలి. కీలక వ్యవహారంలో సొంత నిర్ణయాలు వద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. వృథా ఖర్చులుంటాయి.

కన్య :


 ఏకాగ్రత భంగమవుతుంది. పనిపై శ్రద్ధ తగ్గుతుంది. నమ్మినవారి కారణంగా ఇక్కట్లు వస్తాయి. బుద్ధి నిలకడగా ఉండదు. ఆస్తి అమ్మే ప్రయత్నాలు వాయిదా వేయండి. వృథా ఖర్చులు చికాకు పెడతాయి. ఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు.

తుల :


 అన్ని వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. మిత్రులు తోడుంటారు. కుటుంబ సౌఖ్యం పొందుతారు. దాయాదుల సమస్య తీరుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

వృశ్చికం :


 అనుకున్నవి జరగవు. ధన సంబంధ వ్యవహారాల్లో ఏమరుపాటు వల్ల నష్టం వస్తుంది. మనసుకి కష్టం కలుగుతుంది. మాట నిలుపుకోని కారణంగా అవమాన పడతారు. కుటుంబంలోనూ చికాకులు వస్తాయి.

ధనుస్సు :


 అభీష్టం నెరవేరుతుంది. ధనలాభం గోచరిస్తోంది. మిత్రుల సహకారం లభిస్తుంది. మానసిక స్థితి ఉత్సాహంగా ఉంటుంది. తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. విందులో పాల్గొంటారు.

మకరం :


 వ్యవహారాల్లో నష్టం గోచరిస్తోంది. అప్రమత్తంగా ఉండండి. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగవు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. వేళకు భోజనం ఉండదు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

కుంభం :


 శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక చికాకులు తొలగుతాయి. ఇతరుల నుంచి సహకారం లభిస్తుంది. గృహోపకరణాలు కొంటారు. సంతాన సంబంధ శుభవర్తమానం అందుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు.

మీనం :


 పనులన్నింటా విజయం లభిస్తుంది. అభీష్టం నెరవేరుతుంది. బంధువులతో వినోదాల్లో పాల్గొంటారు. పోటీల్లో శత్రువులపై విజయం సాధిస్తారు. పెద్దల ఆశీస్సులను అందుకుంటారు. గౌరవం పెరుగుతుంది. గృహశాంతి ఉంటుంది.

Tags:    

Similar News