Horoscope Today in Telugu 15th August 2024: ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల ఫలితాలు ఇలా

Horoscope Today in Telugu 15th August 2024: ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల ఫలితాలు ఇలా

Update: 2024-08-15 00:30 GMT

Horoscope Today in Telugu 15th August 2024: ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల ఫలితాలు ఇలా

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, శుక్ల పక్షం

తిధి : దశమి ఉదయం గం.10.26 ని.ల వరకు ఆ తర్వాత ఏకాదశి

నక్షత్రం: జ్యేష్ట మధ్యాహ్నం గం.12.53 ని.ల వరకు ఆ తర్వాత మూల

అమృతఘడియలు: --

అభిజిత్ : ఉ.గం.11.55 ని.ల నుంచి మధ్యాహ్నం గం.12.46 ని.ల వరకు

వర్జ్యం: రాత్రి గం.8.50 ని.ల నుంచి గం.10.25 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.10.13 ని.ల నుంచి గం.11.04 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.3.18 ని.ల నుంచి గం.4.09 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.1.56 ని.ల నుంచి గం.3.31 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 5.59 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.42 ని.లకు

మేషం :


పనుల ఒత్తిడి ఉంటుంది. ఇష్టంలేని కార్యం చేయాల్సి వస్తుంది. ధన నష్టం ఉంది. తండ్రితో సఖ్యత చెడుతుంది. తగాదాలకు దూరంగా ఉండండి. ఆకస్మిక ప్రయాణం ఉంది. కోర్టు వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి.

వృషభం :


ఆశించిన లబ్ది చేకూరుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. బంధుమిత్రులను కలుస్తారు. విందులో పాల్గొంటారు. పోటీల్లో విజేతగా నిలుస్తారు. ఉద్రేకాన్ని అదుపు చేయండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త.

మిథునం :


అన్ని వ్యవహారాల్లో శుభ ఫలితాలను పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ఇతరులపై అపోహలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామి సలహాలు ఉపకరిస్తాయి. ఇతరులతో సత్సంబంధాలు పెరుగుతాయి.

కర్కాటకం:


ఆటంకాలను తేలిగ్గానే దాటేస్తారు. అభీష్టం నెరవేరుతుంది. సంతానం వైఖరిని సరిచేస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. విధి నిర్వహణలో సమర్థతను ప్రదర్శిస్తారు.

సింహం :


 వ్యవహారాల్లో ఆటంకాలను దాటాల్సి వుంటుంది. బద్ధకాన్ని విడిచిపెట్టాలి. బుద్ధి నిలకడత లోపిస్తుంది. ఆత్మీయులతోనే గొడవలొస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆస్తి వ్యవహారాలు వాయిదా వేయండి.

కన్య :


స్థిర చిత్తంతో చేపట్టే పనులు సత్ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక చికాకులు ఉండవు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. మీలోని నాయకత్వ పటిమకు గుర్తింపు లభిస్తుంది. ఈ క్రమంలో ఒత్తిడిని అధిగమించాల్సి వుంటుంది.

తుల :


 కార్యసాధనకు బాగా శ్రమించాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. అవసరానికి తగ్గ ఆదాయం సమకూరుతుంది. కీలక వర్తమానం అందుతుంది. తగాదాలకు దూరంగా ఉండండి. ఆత్మీయులను కలుస్తారు.

వృశ్చికం :


చేపట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. బ్యాంకు లావాదేవీల్లో జాప్యం ఉంటుంది. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. ఉన్నత స్థానం చేరాలన్న లక్ష్యం వైపు అడుగులు పడతాయి. వాగ్వాదాలకు దూరంగా ఉండండి.

ధనుస్సు :


 ఆటంకాలను దాటితేనే లక్ష్యాన్ని చేరతారు. వృథా ఖర్చులు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాలపై శ్రద్ధ పెట్టండి. అదృష్టం తోడుంటుంది. మిత్రులతో విందులో పాల్గొంటారు. మనోధైర్యం పెరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

మకరం :


కార్య జయం ఉంది. ధనలాభం గోచరిస్తోంది. వినోద కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. సంతాన వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. అనవసర జోక్యాలు మానండి.

కుంభం :


ఉత్సాహంగా గడుపుతారు. అభీష్టం నెరవేరుతుంది. నూతన ప్రయత్నాలకు అనుకూలం. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. పెద్దల అభిమానాన్ని పొందుతారు. మిత్రులు సహకరిస్తారు. గృహశాంతి ఉంటుంది.

మీనం :


 ఒడుదుడుకులున్నా వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. పోటీల్లో విజేతగా నిలుస్తారు. బంధు, మిత్రులతో విందులో పాల్గొంటారు. మనసు గట్టిపడుతుంది. ప్రతిభను అధికారులు గుర్తిస్తారు. గౌరవం పెరుగుతుంది.

Tags:    

Similar News