Today Horoscope In Telugu 14th August 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

Today Horoscope In Telugu 14th August 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

Update: 2024-08-14 00:30 GMT

Today Horoscope In Telugu 14th August 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

14-08-2024 (బుధవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, శుక్ల పక్షం

తిధి : నవమి ఉదయం గం.10.23 ని.ల వరకు ఆ తర్వాత దశమి

నక్షత్రం: అనూరాధ మధ్యాహ్నం గం.12.13 ని.ల వరకు ఆ తర్వాత జ్యేష్ట

అమృతఘడియలు: అర్ధరాత్రి దాటిన తర్వాత గం.3.50 ని.ల నుంచి గం.5.29 ని.ల వరకు

వర్జ్యం: సాయంత్రం గం.5.58 ని.ల నుంచి గం.7.37 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.11.55 ని.ల నుంచి గం. 12.46 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.12.21 ని.ల నుంచి గం.1.56 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 5.59 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం.6.42 ని.లకు

మేషం : 


కార్యనష్టాలుంటాయి. చెప్పుడు మాటలు విని అపోహలు పెంచుకోకండి. ఆర్థిక లావాదేవీలను వీలైతే వాయిదా వేయండి. అధికారుల కోపానికి గురయ్యే సూచన ఉంది. వేళకు భోజనం ఉండదు. తగాదాలకు దూరంగా ఉండండి.

వృషభం : 


ప్రయత్నాలు ఫలిస్తాయి. అభీష్టం నెరవేరుతుంది. ధనలాభం ఉంది. మిత్రుల తోడ్పాటు లాభం చేకూరుస్తుంది. జీవిత భాగస్వామి సూచనలు పాటించండి. కొత్త పనులు ప్రారంభించేందుకు అనువైన రోజు.

మిథునం :


రోజంతా ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. పోటీదారులపై విజయం సాధిస్తారు. కొత్త వస్తువులు కొంటారు. బలహీనతలను జయిస్తారు. కోర్టుల్లో గెలుస్తారు. ఆరోగ్యం బావుంటుంది.

కర్కాటకం:


 ఆటంకాలను దాటాల్సి వుంటుంది. బద్ధకం చేటు తెస్తుంది. వ్యవహారాలపై మీ విశ్లేషణ తప్పవుతుంది. కీలక నిర్ణయాల్లో సొంత తెలివితేటలు వాడకండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. సంతానం తీరు చిరాకును తెప్పిస్తుంది.

సింహం :


 పనులు నెమ్మదిస్తాయి. ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త. తల్లి తరఫు బంధువుల గురించిన సమాచారం అందుతుంది. స్థిరాస్తి వ్యవహారాలు వాయిదా వేయండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

కన్య :


 ఆశించిన ప్రయోజనాలను పొందుతారు. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. మిత్రులను కలుస్తారు. దగ్గరి ప్రయాణం గోచరిస్తోంది. శుభ ఫలితం ఉంటుంది. తోబుట్టువుల గురించి ఆలోచిస్తారు. మనశ్శాంతిని పొందుతారు.

తుల :


 పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. సకాలంలో మాట నిలుపుకోని కారణంగా అవమానానికి గురవుతారు. బద్ధకాన్ని వదిలితే మంచిది. ఇతరుల కారణంగా ఇబ్బందుల్లో పడతారు. తగాదాలకూ దూరంగా ఉండండి.

వృశ్చికం :


 పనులు సంతృప్తికరంగా సాగుతాయి. ధనలాభం ఉంది. కుటుంబం గురించి శ్రద్ధ వహిస్తారు. సత్సంబంధాలు ఏర్పడతాయి. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం ఉంది.

ధనుస్సు :


అనుకున్నట్లుగా పనులు సాగవు. ఆర్థిక సమస్యలు చికాకు పెడతాయి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి. వేళకు భోజనం ఉండదు. మిత్రులతోనూ సఖ్యత చెడే సూచన ఉంది. వృథా ప్రయాణాలు మానండి.

మకరం :


 రోజంతా శుభప్రదంగా సాగుతుంది. ఇతరుల నుంచి చక్కటి సహకారం లభిస్తుంది. గృహావసరాలు తీరుస్తారు. సంతాన వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. నూతన పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. విందులో పాల్గొంటారు.

కుంభం :


అభీష్టం నెరవేరుతుంది. యత్నకార్యం సఫలం అవుతుంది. అధికారుల అభిమానాన్ని పొందుతారు. కొత్త బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. విదేశీ ప్రయాణ యత్నాలు ఫలిస్తాయి.

మీనం :


పనులు అనుకున్నరీతిలో సాగవు. శత్రువుల బెడద పెరుగుతుంది. అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు వాయిదా వేయండి. ఇంటికి దూరంగా వెళ్లాల్సి వస్తుంది. సంతానంతో సఖ్యత చెడుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

Tags:    

Similar News