Today Horoscope in Telugu 13th August 2024: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే
Today Horoscope in Telugu 13th August 2024: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే
13-08-2024 (మంగళవారం)
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, శుక్ల పక్షం
తిధి : అష్టమి ఉదయం గం.9.31 ని.ల వరకు ఆ తర్వాత నవమి
నక్షత్రం: విశాఖ ఉదయం గం.10.44 ని.ల వరకు ఆ తర్వాత అనూరాధ
అమృతఘడియలు: అర్ధరాత్రి దాటిన తర్వాత గం.1.10 ని.ల నుంచి గం.2.52 ని.ల వరకు
వర్జ్యం: మధ్యాహ్నం గం.2.59 ని.ల నుంచి గం.4.41 ని.ల వరకు
దుర్ముహూర్తం : ఉదయం గం.8.32 ని.ల నుంచి గం.9.23 ని.ల వరకు మళ్లీ రాత్రి గం.11.13 ని.ల నుంచి గం.11.58 ని.ల వరకుకు
రాహుకాలం : మధ్యాహ్నం గం.3.32 ని.ల నుంచి గం.5.07 ని.ల వరకు
సూర్యోదయం : తె.వా. గం. 5.59 ని.లకు
సూర్యాస్తమయం : సా. గం. 6.43 ని.లకు
మేషం :
కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. ఆటంకాల వల్ల పనులు నెమ్మదిస్తాయి. డబ్బుకి కాస్త ఇబ్బంది ఉంటుంది. ఇరుగు పొరుగుతో తగాదాలు గోచరిస్తున్నాయి. పోటీలలో ఓటమి ఎదురవుతుంది. పెద్దల కోపానికి గురవుతారు.
వృషభం :
ప్రణాళిక ప్రకారమే పనులు పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. బంధాలు బలపడతాయి. జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. వినోదాల్లో పాల్గొంటారు.
మిథునం :
వ్యవహార జయం ఉంది. ఆటంకాలను తేలిగ్గా దాటేస్తారు. సమయస్ఫూర్తికి ప్రశంసలు అందుకుంటారు. డబ్బుకి సంబంధించిన చికాకు తొలగిపోతుంది. పోటీదారులను జయిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి.
కర్కాటకం:
అభీష్టం నెరవేరేందుకు విపరీతంగా శ్రమించాలి. బద్ధకం వల్ల వ్యవహారాల్లో నష్టం కలుగుతుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. అవసరానికి మీ తెలివితేటలు ఉపకరించవు. మనశ్శాంతి కరువవుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.
సింహం :
ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. అయినవారితోనే గొడవలు వస్తాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వాహనాల వల్ల ఇబ్బంది గోచరిస్తోంది. సమర్థించే వారే ముఖం చాటేస్తారు.
కన్య :
అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. సహచరులతో సంబంధాలు బలపడతాయి. నాయకత్వ పటిమకు గుర్తింపు లభిస్తుంది. మనసుకు ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు.
తుల :
ఆటంకాలను దాటాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. వృథా ఖర్చులుంటాయి. కుటుంబంలోని చికాకులపై దృష్టి పెట్టాలి. నిందలు వస్తాయి. వేళకు భోజనం ఉండదు. నిజాయితీతో ఉండండి. ఆరోగ్యం జాగ్రత్త.
వృశ్చికం :
ఉత్సాహభరితంగా ఉంటుంది. ధనలాభం ఉంది. వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. విందులో పాల్గొంటారు. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. కొత్త విషయాలను తెలుసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. గౌరవం పెరుగుతుంది.
ధనుస్సు :
పనుల్లో వేగం తగ్గుతుంది. ధన సంబంధ వ్యవహారాల్లో జాప్యం ఉంటుంది. ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. వేళకు భోజనం ఉండదు. బాధ్యతలు బరువుగా తోస్తాయి. ఆత్మవిశ్వాసంతో సాగండి.
మకరం :
వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. ధనలాభం ఉంది. రుణ సంబంధ అంశాలు మీకు అనుకూలంగా ఉంటాయి. సంతాన సంబంధ ఆకాంక్ష నెరవేరుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మనశ్శాంతి లభిస్తుంది.
కుంభం :
అన్నింటా అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సామర్థ్యానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఇంటి విషయాలు తృప్తినిస్తాయి. పోటీదారులపై విజయం సాధిస్తారు.
మీనం :
ఆశించిన రీతిలో పనులు జరగవు. ఆర్థిక వ్యవహారాలు చికాకు పెడతాయి. సంతానం తీరు ఆవేదన కలిగిస్తుంది. పుణ్యక్షేత్ర సందర్శన గోచరిస్తోంది. కాలికి సమస్య గోచరిస్తోంది. శత్రువులు, రుణదాతల బెడద పెరుగుతుంది.