Today Horoscope in Telugu 12th August 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

Today Horoscope in Telugu 12th August 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

Update: 2024-08-12 00:30 GMT

Today Horoscope in Telugu 12th August 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

12-08-2024 (సోమవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, శుక్ల పక్షం

తిధి : సప్తమి ఉదయం గం.7.55 ని.లకు ఆ తర్వాత అష్టమి

నక్షత్రం: స్వాతి ఉదయం గం.8.33 ని.ల వరకు ఆ తర్వాత విశాఖ

అమృతఘడియలు: అర్ధరాత్రి దాటిన తర్వాత గం.1.08 ని.ల నుంచి గం.2.53 ని.ల వరకు

వర్జ్యం: మధ్యాహ్నం గం.2.40 ని.ల నుంచి గం.4.24 ని.ల వరకు

దుర్ముహూర్తం : మధ్యాహ్నం గం.12.47 ని.ల నుంచి గం.1.38 ని.లకు మళ్లీ మధ్యాహ్నం గం.3.20 ని.ల నుంచ గం.4.11 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.7.34 ని.ల నుంచి గం.9.10 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 5.58 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.44 ని.లకు

మేషం :


అనుకూలమైన ఫలితాలుంటాయి. అన్ని ప్రయత్నాల్లోనూ విజయం లభిస్తుంది. బ్యాంకు లావాదేవీలు, భాగస్వామ్య వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. కోరిక తీరుతుంది. ఇరుగుపొరుగుతో సఖ్యత ఉంటుంది.

వృషభం : 


మనసును వేధిస్తున్న సందేహాలు తొలగిపోతాయి. పనిలో శ్రద్ధ పెరుగుతుంది. పోటీదారులపై విజయం సాధిస్తారు. మిత్రుల అండతో శుభ ఫలితాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంది. కీర్తి పెరుగుతుంది.

మిథునం : 


ఆటంకాలు ఎదురవుతాయి. శక్తిసామర్థ్యాలపై నమ్మకాన్ని కోల్పోకండి. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. కీలక నిర్ణయాల్లో ఆత్మీయుల సూచనలు తీసుకోండి. విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు జాగ్రత్త.

కర్కాటకం:


 బుద్ధి నిలకడగా ఉండదు. చెప్పుడు మాటలు మరింత చికాకు పరుస్తాయి. స్వజనులతోనే విరోధం గోచరిస్తోంది. ఆస్తి అమ్మే ప్రయత్నాలు వాయిదా వేయండి. వృథాఖర్చులు తగ్గించాలి. ఆరోగ్యం జాగ్రత్త.

సింహం :


 శుభ ఫలితాలుంటాయి. అన్నివైపులా మంచే జరుగుతుంది. ధనలాభం ఉంది. గృహోపకరణాలకు ఖర్చు చేస్తారు. సోదరులు తోడుగా నిలుస్తారు. నాయకత్వ పటిమకు గుర్తింపు లభిస్తుంది. ఇరుగుపొరుగుతో బంధం గట్టిపడుతుంది.

కన్య :


 కార్యసాధనలో ఆటంకాలు ఎదురవుతాయి. ఇతరుల వల్ల వ్యవహారాల్లో జాప్యం పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. కష్టాల్లోని వారికి సహకరించాలన్న మీ ప్రయత్నం ముందుకు సాగదు.

తుల :


 వ్యక్తిత్వంతో ఆకట్టుకుంటారు. పనులు సవ్యంగా సాగుతాయి. ధనలాభం ఉంది. మానసిక స్థితి ఉత్సాహంగా ఉంటుంది. ఉన్నత స్థానానికి ఎదగే ప్రయత్నం అనుకూలిస్తుంది. స్వస్థానం చేరుకుంటారు. గౌరవం లభిస్తుంది.

వృశ్చికం :


 పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీల్లో అజాగ్రత్త వల్ల నష్టపోతారు. ఇతరుల వ్యవహారాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండండి. అనవసర ప్రయాణాలు మానుకోండి. నోటి దురుసుతనం తగ్గించుకుంటే మేలు.

ధనుస్సు :


 ఆకాంక్ష నెరవేరుతుంది. ఆదాయం పెరుగుతుంది. రుణ సంబంధ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వస్తువులను కొంటారు. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. మనశ్శాంతిని పొందుతారు.

మకరం :


 చేపట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. పెద్దలు, అధికారుల ఆశీస్పులను పొందుతారు. గౌరవం పెరుగుతుంది. ఇంటి పరిస్థితులు సంతృప్తినిస్తాయి. ఆరోగ్యం బావుంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

కుంభం :


 నిర్దేశిత రీతిలో పనులు జరగవు. ఆదాయ వనరులూ తగ్గుతాయి. తండ్రితో సఖ్యత చెడుతుంది. దూర ప్రయాణం ఉంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. శత్రువుల సమస్య ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన మేలు.

మీనం :


 కార్యనష్టం ఉంది. ఆర్థిక లావాదేవీలు చికాకు పరుస్తాయి. అపోహల వల్ల మానసిక ఆందోళన పెరుగుతుంది. వాగ్వాదాలకు దూరంగా ఉండండి. ఇష్టంలేని పనులు చేయాల్సి వస్తుంది. పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది.


Full View


Tags:    

Similar News