Horoscope Today in Telugu 10th August 2024: ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల ఫలితాలు ఇలా
Horoscope Today in Telugu 10th August 2024: ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల ఫలితాలు ఇలా
10-08-2024 (శనివారం)
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, శుక్ల పక్షం
తిధి : షష్ఠి రేపు తె.వా.గం.5.44 ని.ల వరకు ఆ తర్వాత సప్తమి
నక్షత్రం: చిత్త రేపు తె.వా.గం.5.49 ని.ల వరకు ఆ తర్వాత స్వాతి
అమృతఘడియలు: రాత్రి గం.10.35 ని.ల నుంచి అర్ధరాత్రి గం.12.24 ని.ల వరకు
వర్జ్యం: ఉదయం గం.11.46 ని.ల నుంచి గం.1.34 ని.ల వరకు
దుర్ముహూర్తం : ఉదయం గం.5.58 ని.ల నుంచి గం. 7.40 ని.ల వరకు
రాహుకాలం : ఉదయం గం.9.10 ని.ల నుంచి గం.10.46 ని.ల వరకు
సూర్యోదయం : తె.వా. గం. 5.58 ని.లకు
సూర్యాస్తమయం : సా. గం.6.45 ని.లకు
మేషం :
వివాహాది శుభకార్యాల గురించి చర్చిస్తారు. జీవితభాగస్వామిపై ఆకర్షణ, అనురాగం పెరుగుతాయి. కీలక రహస్యాలు తెలుస్తాయి. ప్రయాణం సాఫీగా సాగుతుంది. పోయిన సొత్తు తిరిగి లభిస్తుంది. కీర్తి పెరుగుతుంది.
వృషభం :
పనులు సవ్యంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. అభీష్టం నెరవేరుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి.
మిథునం :
ఆటంకాలను అధిగమించేందుకు బాగా కష్టపడాల్సి వుంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో నష్టం గోచరిస్తోంది. పరిస్థితిని విశ్లేషించడంలో విఫలమవుతారు. సంతానం తీరు చికాకు పెడుతుంది. వాత సంబంధ సమస్యలు ఉంటాయి.
కర్కాటకం:
కార్యనష్టాల వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. భూసంబంధ వ్యవహారాలు వాయిదా వేయండి. విద్యారంగంలోని వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. తల్లి బంధు వర్గం గురించి చెడు వార్త వింటారు.
సింహం :
అభీష్ట నెరవేరుతుంది. ధన సంబంధ వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. కీలక వ్యవహారాల్లో నాయకత్వ ప్రతిభను ప్రదర్శిస్తారు. కుటుంబ సౌఖ్యం పొందుతారు. ఇరుగుపొరుగుతో సఖ్యత ఉంటుంది. ఆత్మశాంతి లభిస్తుంది.
కన్య :
పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు చికాకు పెడతాయి. కుటుంబం విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి వుంటుంది. భావాన్ని వ్యక్తీకరించడంలో తడబడే సూచన ఉంది. ఇతరుల వల్ల ఇబ్బంది గోచరిస్తోంది.
తుల :
ఇవాళంతా అదృష్టం తోడుగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనీ విజయవంతం అతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ధనలాభం ఉంది. మీ పనితీరుకు చక్కటి ప్రశంసలు అందుతాయి. జన్మస్థలం గురించిన స్మరణ ఉంటుంది.
వృశ్చికం :
పనులకు విపరీతమైన ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి. పాదాలు, ఎడమకంటి సమస్యలుంటాయి. వేళకు భోజనం ఉండదు. నిద్రలేమి వేధిస్తుంది.
ధనుస్సు :
అభీష్టం నెరవేరుతుంది. చేపట్టిన ప్రతి వ్యవహారంలోనూ శుభ ఫలితాలు వస్తాయి. ఆర్థిక లావాదేవీలు మెరుగ్గా ఉంటాయి. శత్రువుల పీడ తగ్గుతుంది. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చిస్తారు. మనశ్శాంతి లభిస్తుంది.
మకరం :
కార్యాలను స్థిర నిర్ణయంతో చేయడం వల్ల సత్ఫలితాలు లభిస్తాయి. మంచి అవకాశాలు అందివస్తాయి. విరోధాలు సమసిపోతాయి. అధికారుల అభిమానాన్ని పొందుతారు. బంధువులతో విందులో పాల్గొంటారు.
కుంభం :
అప్రమత్తంగా ఉండాలి. పనులు అనుకున్నట్లుగా జరగవు. ఆర్థిక వ్యవహారాల్లో నష్టం గోచరిస్తోంది. కలహాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. త్వరగా అలసిపోతారు. ఖర్చు విపరీతంగా ఉంటుంది.
మీనం :
పనులు సజావుగా సాగవు. ఆర్థిక వ్యవహారాల్లో చికాకులు తలెత్తుతాయి. అనవసర దురభిప్రాయాలు ఏర్పడతాయి. తగాదాలకు దూరంగా ఉండండి. ఇష్టంలేని పనులూ చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త.