Horoscope Today in Telugu, 1 August 2024: ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల ఫలితాలు ఇలా
Horoscope Today in Telugu, August 1, 2024: ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. ఈరోజు 12 రాశుల ఫలితాలు ఇలా.
01-08-2024 (గురువారం)
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ రుతువు, కృష్ణ పక్షం
తిధి : ద్వాదశి మధ్యాహ్నం గం.3.28 ని.ల వరకు ఆ తర్వాత త్రయోదశి
నక్షత్రం: మృగశిర ఉదయం గం.10.24 ని.ల వరకు తర్వాత ఆరుద్ర
అమృతఘడియలు: ఇవాళ అర్ధరాత్రి గం.12.44 ని.ల నుంచి గం. 2.22 ని.ల వరకు
వర్జ్యం: రాత్రి గం.7.00 ని.ల నుంచి గం.8.38 ని.ల వరకు
దుర్ముహూర్తం : ఉదయం గం.10.13 ని.ల నుంచి గం.11.05 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.3.23 ని.ల నుంచి గం. 4.15 ని.ల వరకు
రాహుకాలం : మధ్యాహ్నం గం.1.59 ని.ల నుంచి గం. 3.36 ని.ల వరకు
సూర్యోదయం : తె.వా. గం. 5.56 ని.లకు
సూర్యాస్తమయం : సా. గం.6.49 ని.లకు
మేషం :
మీ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు. అభీష్టం నెరవేరుతుంది.బుద్ధికుశలతకు ప్రశంసలు లభిస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. ఆకస్మిక ధనలాభముంది. అగ్రిమెంట్లు చేసుకునేందుకు అనుకూలం.
వృషభం :
ఏ పక్షానా వకాల్తా పుచ్చుకోకండి. బ్యాంకు లావాదేవీలు సజావుగా సాగవు. షేర్లలో పెట్టుబడులు అంతగా లాభించవు. అప్పు వసూలు కాదు. కోర్టు కేసులు నిర్లక్ష్యం చేయకండి. భాగస్వామికి ప్రమాదం గోచరిస్తోంది.
మిథునం :
కార్యసిద్ధి ఉంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. మీ వ్యక్తిత్వంతో పెద్దల అభిమానాన్ని పొందుతారు. కనిష్ట సోదరుడికి లాభం చేకూరుతుంది. మేనమామ గురించిన వర్తమానం అందుతుంది. కీర్తి పెరుగుతుంది.
కర్కాటకం:
కార్యాలకు ఆటంకాలు ఉంటాయి. మీ సలహాలకు విలువ ఉండదు. ఆర్థిక వ్యవహారాలు చికాకు పెడతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. నిద్రలేమి చికాకు పెడుతుంది. చేయని తప్పునకు నింద భరించాల్సి వస్తుంది.
సింహం:
అన్ని విధాలా బాగుంటుంది. ప్రభుత్వం నుంచి ఆర్థిక లబ్ది గోచరిస్తోంది. అదృష్టం తోడుగా ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితముంటుంది. ఇష్టమైన వారిని కలుస్తారు. మిత్రులతో వినోదంగా గడుపుతారు.
కన్య :
అభీష్టం నెరవేరుతుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక ప్రయోజనం పొందుతారు. దత్తత వ్యవహారాలకు అనుకూలం. శత్రువులపై విజయం సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం బావుటుంది.
తుల :
పనుల్లో ఆటంకాలుంటాయి. ధన సంబంధ వ్యవహారాలు నెమ్మదిస్తాయి. ఆచారాలను పాటిస్తారు. కొత్త విషయాలను కనిపెడతారు. దూర ప్రయాణం గోచరిస్తోంది. ఉన్నత విద్యకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృశ్చికం :
పనులు సజావుగా సాగవు. ఆర్థిక క్రమశిక్షణ తప్పుతుంది. అప్పులు చేయాల్సి వస్తుంది. అపోహలు పెంచుకుంటారు. తగాదాలకు ఆస్కారం ఉంది. పెద్దల ఆగ్రహానికి గురవుతారు. మనశ్శాంతిని కోల్పోతారు.
ధనుస్సు :
చేపట్టిన పనులు ఫలిస్తాయి. కాంట్రాక్టుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బ్యాంకు లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఇతరులు తోడ్పడతారు. కొత్త విషయాలను గ్రహిస్తారు. ప్రయాణం లాభిస్తుంది.
మకరం :
పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. అప్పు చెల్లించే ప్రయత్నం అనుకూలిస్తుంది. సేవారంగంలోని వారికి అనుకూలం. కష్టించే తత్వానికి గుర్తింపు లభిస్తుంది. బంధుమిత్రులను కలుస్తారు. దైవకార్యాల్లో పాల్గొంటారు.
కుంభం :
కార్యనిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి. సమకాలికులతో పోటీ ఏర్పడతుంది. మీ తెలివితేటలకు గుర్తింపు లభించదు. ఆలోచనలు వక్రగతిలో సాగుతాయి. నిరాశ చెందకుండా కష్టపడాలి. విలువైన వస్తువులు జాగ్రత్త.
మీనం :
వ్యవహార నష్టం గోచరిస్తోంది. ఆర్థికంగా చికాకులు తలెత్తుతాయి.బుద్ధి నిలకడగా ఉండదు. విద్యారంగంలోని వారు జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి అమ్మే ప్రయత్నాలు లాభించవు. నిరాధార నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది.