Today Horoscope In Telugu, 9 August 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

Today Horoscope In Telugu, 9 August 2024: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. 12 రాశుల ఫలితాలు ఇలా.

Update: 2024-08-09 01:00 GMT

Today Horoscope In Telugu, 9 August 2024

09-08-2024 (శుక్రవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, శుక్ల పక్షం

తిధి : పంచమి అర్ధరాత్రి దాటిన తర్వాత గం.3.14 ని.ల వరకు ఆ తర్వాత షష్ఠి

నక్షత్రం: హస్త అర్ధరాత్రి దాటిన తర్వాత గం.2.44 ని.ల వరకు ఆ తర్వాత చిత్త

అమృతఘడియలు: రాత్రి గం.7.57 ని.ల నుంచి గం.9.45 ని.ల వరకు

వర్జ్యం: ఉదయం గం.9.05 ని.ల నుంచి గం.10.53 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.8.31 ని.ల నుంచి గం.9.22 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.12.47 ని.ల నుంచి గం.1.38 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.10.46 ని.ల నుంచి గం. 12.22 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 5.58 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.45 ని.లకు

మేషం : 


లక్ష్యాన్ని చేరుకుంటారు. ధన సంబంధ లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కొత్త వస్తువులు కొంటారు. మిత్రుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

వృషభం : 


సంతానం తీరు ఆందోళన కలిగిస్తుంది. మీ మాటలకు విలువ ఉండదు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. దురాలోచనలు సతమతం చేస్తాయి. అకారణ విరోధాలు వస్తాయి. నిరాశను వీడి స్థిరచిత్తంతో సాగండి.

మిథునం : 


 పనులు అనుకున్న మేర తృప్తిగా సాగవు. ధన నష్టం గోచరిస్తోంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. భూ సంబంధ లావాదేవీలు వాయిదా వేయండి. బుద్ధి నిలకడ లోపిస్తుంది. బంధువులతో విరోధం విచారాన్ని పెంచుతుంది.

కర్కాటకం:


 పని సఫలం అవుతుంది. డబ్బుకి ఇబ్బంది ఉండదు. మాట పలుకుబడి పెరుగుతుంది. దాయాదులతో సఖ్యత ఉంటుది. శుభవర్తమానం అందుతుంది. మీ పరాక్రమానికి గుర్తింపు వస్తుంది. మిత్రులు తోడుంటారు.

సింహం :


 అనవసరంగా మాట తూలడం వల్ల దీర్ఘకాల ఇబ్బంది వస్తుంది. అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు లావాదేవీలు తృప్తిగా సాగవు. కుటుంబంలోనూ చికాకులుంటాయి. వేళకు భోజనముండదు. మనశ్శాంతి లోపిస్తుంది.

కన్య :


 శుభ ఫలితాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లోని వారు లక్ష్యాన్ని చేరుకుంటారు. మీ తెలివేతటలకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఆరోగ్యం బావుంటుంది. మనశ్శాంతిని పొందుతారు.

తుల :


 అనుకున్న సమయానికి పనులు పూర్తి కావు. ధన సంబంధ చికాకులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చడం వల్ల ఇబ్బందుల్లో పడతారు. బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి రావచ్చు. బద్ధకం వీడి కష్టించాలి.

వృశ్చికం :


 రోజంతా ఉత్సాహభరితంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. మిత్రుల తోడ్పాటుతో ఘనమైన లక్ష్యాన్ని చేరుకుంటారు. విందుల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. సంతానం వృద్ధి తృప్తినిస్తుంది.

ధనుస్సు :


 చేపట్టిన ప్రతి కార్యం విజయవంతం అవుతుంది. అభీష్టం నెరవేరుతుంది. బంధువులను కలుస్తారు. ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. పెద్దల అభిమానాన్ని పొందుతారు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. కీర్తి పెరుగుతుంది.

మకరం :


 పనుల పూర్తికి బాగా కష్టపడాల్సి ఉంటుంది. పిత్రార్జిత వ్యవహారాలు అసంతృప్తిని మిగులుస్తాయి. కడుపులో ఏదైనా ఇబ్బంది రావచ్చు. సంతానం తీరు కోపాన్ని తెప్పిస్తుంది. బంధువులో సఖ్యత ఉండదు. ఆరోగ్యం జాగ్రత్త.

కుంభం :


 చెప్పుడు మాటలు వినకండి. దురభిప్రాయాలను విడిచిపెట్టండి. అధికారుల కోపానికి గురయ్యే సూచన ఉంది. ఉద్యోగులు బాగా అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. అజీర్తి సమస్య ఉంటుంది.

మీనం :


 అన్ని ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. కొత్త విషయాలను గ్రహిస్తారు. విందులో పాల్గొంటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి.


Full View


Tags:    

Similar News