Horoscope Today in Telugu 05 August 2024: ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల ఫలితాలు ఇలా
Horoscope Today in Telugu 05 August 2024: ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల ఫలితాలు ఇలా
05-08-2024 ( సోమవారం )
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, కృష్ణ పక్షం
తిధి : పాడ్యమి సాయంత్రం గం.6.03 ని.ల వరకు ఆ తర్వాత విదియ
నక్షత్రం: ఆశ్లేష మధ్యాహ్నం గం.2.31 ని.ల వరకు ఆ తర్వాత మఖ
అమృతఘడియలు: మధ్యాహ్నం గం.1.38 ని.ల నుంచి గం.3.21 ని.ల వరకు
వర్జ్యం: రేపు తె.వా. గం.4.33 ని.ల నుంచి గం.6.18 ని.ల వరకు
దుర్ముహూర్తం : మధ్యాహ్నం గం.12.48 ని.ల నుంచి గం.1.39 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.3.22 ని.ల నుంచి గం 4.13 ని.ల వరకు
రాహుకాలం : ఉదయం గం.7.33 ని.ల నుంచి గం. 9.09 ని.ల వరకు
సూర్యోదయం : తె.వా. గం. 5.57 ని.లకు
సూర్యాస్తమయం : సా. గం.6.47 ని.లకు
మేషం :
పనులు ఆశించినట్లుగా సాగవు. కఠిన పరీక్షలు ఎదురవుతాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. మీ పనితీరుకు తగిన గుర్తింపు లభించదు. అనుమానాలు వద్దు. ఎవరితోనూ వైరం సరికాదు. బద్ధకించకుండా కష్టపడండి.
వృషభం :
పనులకు ఆటంకాలు ఎదురవుతుంటాయి. బ్యాంకు లావాదేవీలు బాగానే ఉంటాయి. సోదరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలక సమాచారం అందుతుంది. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. భయం వద్దు.
మిథునం :
కొంత కష్టం తర్వాత ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టండి. సోదరవర్గం సహకరిస్తుంది. వేరే వ్యవహారాల్లో తలదూర్చకండి. వేళకు భోజనం ఉండదు. అనూహ్య ఖర్చులుంటాయి.
కర్కాటకం:
అనుకూలమైన రోజిది. మాట పలుకుబడి పెరుగుతుంది. అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండండి. వివిధ రంగాల్లోని వారికి శుభ ఫలితాలు ఉంటాయి. గౌరవం వృద్ధి చెందుతుంది.
సింహం:
అడ్డంకులు దాటితేనే శుభ ఫలితాలు లభిస్తాయి. కీలక తరుణంలో అదృష్టం తోడుగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. విందులో పాల్గొంటారు. వృథా ఖర్చులు తగ్గించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.
కన్య :
ఆశించిన లక్ష్యం చేరతారు. విధుల నిర్వహణలో ప్రశంసలను పొందుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అవసరమైన సౌకర్యాలు సమకూరతాయి. మధ్యాహ్నం తర్వాత పరిస్థితి కాస్త అసౌకర్యంగా ఉంటుంది.
తుల :
యోగదాయకంగా ఉంటుంది. లక్ష్యసాధనలో విజయం సాధిస్తారు. అన్ని చోట్లా అనుకూలతలే ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. కుటుంబ సౌఖ్యం పొందుతారు. బంధాలు దృఢమవుతాయి.
వృశ్చికం :
అనుకూల ఫలితాలను పొందుతారు. ప్రతిచోటా గౌరవం లభిస్తుంది. పెద్దల మన్ననలను పొందుతారు. దన సంబంధ చికాకులు తొలగిపోతాయి. స్థిరత్వం పెరుగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. బాగా అలసిపోతారు.
ధనుస్సు :
అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండండి. అనూహ్య ఇబ్బంది వస్తుంది. తగాదాలకు దూరంగా ఉండండి. అధికారుల కోపానికి గురవుతారు. ఖర్చులు పెరిగిపోతాయి. అశాంతి పెరుగుతుంది. దైవ చింతన మేలు.
మకరం :
అన్ని ప్రయత్నాలూ సఫలం అవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలు తృప్తినిస్తాయి. జీవిత భాగస్వామి సూచన మేలు చేస్తుంది. చెప్పుడు మాటలు వినకండి. ఖర్చు తగ్గించండి. ఆరోగ్యం జాగ్రత్త.
కుంభం :
సంతోషంగా ఉంటారు. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. బంధువులతో విందులో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. క్షేత్ర దర్శనం ఉంది.
మీనం :
కార్యసాధనకు ఆటంకాలు దాటాలి. డబ్బుకి ఇబ్బంది ఉండదు. శత్రువులపై విజయం సాధిస్తారు. స్వస్థానం చేరతారు. విందుల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. సంతానం తీరు చికాకు పెడుతుంది.