Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 03 August 2024
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 03 August 2024
03-08-2024 (శనివారం)
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ రుతువు, కృష్ణ పక్షం
తిధి : చతుర్దశి మధ్యాహ్నం గం.3.50 ని.ల వరకు ఆ తర్వాత అమావాస్య
నక్షత్రం: పునర్వసు గం. 11.59 ని.ల వరకు ఆ తర్వాత పుష్యమి
అమృతఘడియలు: ఉదయం గం.9.29 ని.ల నుంచి గం.11.09 ని.ల వరకు
వర్జ్యం: రాత్రి గం.8.29 ని.ల నుంచి గం.10.10 ని.ల వరకు
దుర్ముహూర్తం : ఉదయం గం.5.56 ని.ల నుంచి గం.7.39 ని.ల వరకు
రాహుకాలం : ఉదయం గం.9.09 ని.ల నుంచి గం.10.46 ని.ల వరకు
సూర్యోదయం : తె.వా. గం. 5.56 ని.లకు
సూర్యాస్తమయం : సా. గం.6.48 ని.లకు
మేషం :
పనులు అనుకున్నట్లుగా సాగవు. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. వంశపారంపర్య ఆస్తుల వ్యవహారాల్లో కదలిక వస్తుంది. ఆశ్చర్యకరమైన రహస్య విషయాలు తెలుస్తాయి. విద్యాసంబంధ వ్యవహారాలు చెడతాయి.
వృషభం :
కార్యలాభం ఉంది. ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ప్రచురణ, ప్రసార రంగాల్లోని వారికి అనుకూలం. మీ జ్ఞాపక శక్తి మిమ్మల్ని గొప్పగా నిలబెడుతుంది. మిత్రుల వల్ల లబ్ది పొందతారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది.
మిథునం :
అనుకున్నవి జరగవు. అడుగడుగునా ఆటంకాలను దాటాల్సి ఉంటుంది. ఇతరుల వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడతారు. అకారణ విరోధాలూ గోచరిస్తున్నాయి. కుటుంబంలో చికాకులుంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.
కర్కాటకం:
చేపట్టిన పనులు శుభప్రదంగా సాగుతాయి. వ్యక్తిగతంగా మంచి లబ్దిని పొందుతారు. ఆర్థిక చిక్కులుండవు. అదృష్టం వరిస్తుంది. చక్కటి సౌకర్యాలు సమకూరతాయి. విందులో పాల్గొంటారు. ప్రశంసలను పొందుతారు.
సింహం :
కార్యాల్లో నష్టపోతారు. ఆర్థికంగా ఇబ్బందులొస్తాయి. బంధువులు సహకరించరు. కుటుంబానికి దూరంగా వెళ్లే స్థితి ఉంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు. బద్ధకాన్ని వీడాలి. వృథా ఖర్చులను అదుపు చేయాలి.
కన్య :
కాలం ఆనందంగా గడిచిపోతుంది. పనులు అనుకున్నట్లే పూర్తవుతాయి. ఇష్టులతో గడుపుతారు. సౌకర్యాలు సమకూరతాయి. మిత్రుల తోడ్పాటు లభిస్తుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. మనశ్శాంతిని పొందుతారు.
తుల :
అభీష్టం సిద్ధిస్తుంది. యత్నించిన కార్యం సఫలం అవుతుంది. ఇతరులతో విభేదాలు సమసిపోతాయి. పెద్దల అభిమానం పొందుతారు. అవకాశాలు అందివస్తాయి. గౌరవం పెరుగుతుంది. రోజు సుఖంగా సాగుతుంది.
వృశ్చికం :
ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగవు. సంతానంతో విభేదాలు గోచరిస్తున్నాయి. వారసత్వ ఆస్తుల వ్యవహారం చిక్కులు తెస్తుంది. అనూహ్య ఖర్చులుంటాయి. మనశ్శాంతి కరువవుతుంది. దైవ చింతన పెరుగుతుంది.
ధనుస్సు :
పనులు సవ్యంగా సాగవు. అనుకున్న రీతిలో సౌకర్యాలు సమకూరవు. ఆర్థిక వ్యవహారాలు నష్టదాయకంగా ఉంటాయి. అపోహల వల్ల తగాదాలు వచ్చే వీలుంది. పెద్దల కోపానికి గురవుతారు. పైత్య సమస్యలుంటాయి.
మకరం :
శుభప్రదంగా ఉంటుంది. పనులు సజావుగా సాగడం ఆనందాన్నిస్తుంది. అవసరమైన మేర డబ్బు లభిస్తుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. జీవిత భాగస్వామి సూచన మేలు చేస్తుంది. ప్రయాణాలు సుఖంగా ఉంటాయి.
కుంభం :
వ్యవహారాలు అనుకున్నట్లే సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మీ అదుపులో ఉంటాయి. బంధువుల నుంచి ప్రశంసలను అందుకుంటారు. వినోదాల్లో పాల్గొంటారు. కొత్త వస్తువులను కొంటారు. ఆరోగ్యం బావుంటుంది.
మీనం :
ఆటంకాలను అధిగమించాల్సి వుంటుంది. బద్ధకించకుండా కార్యాలు కొనసాగించండి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు. వృథా ఖర్చులుంటాయి. కీలక వేళల్లో సన్నిహితుల సూచనలు పాటించండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.