Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 5 July 2024
Today Horoscope in Telugu 5th July 2024: ఈరోజు ఎవరికి ఎలా ఉంటుంది? ఎవరికి కలిసొస్తుంది? ఎవరికి సమస్యలు పొంచి ఉన్నాయి? 5 జులై 2024 శుక్రవారంనాటి 12 రాశి ఫలాలపై జ్యోతిష్య పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం.
Today Horoscope in Telugu 5th July 2024: ఈరోజు ఎవరికి ఎలా ఉంటుంది? ఎవరికి కలిసొస్తుంది? ఎవరికి సమస్యలు పొంచి ఉన్నాయి? 5 జులై 2024 శుక్రవారంనాటి 12 రాశి ఫలాలపై జ్యోతిష్య పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం.
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, కృష్ణ పక్షం
తిధి: అమావాస్య రేపు తె.వా గం.4.26 ని.ల వరకు ఆ తర్వాత శుద్ధ పాడ్యమి
నక్షత్రం: ఆరుద్ర రేపు తె.వా. గం.4.06 ని. ల వరకు పునర్వసు
అమృతఘడియలు: సాయంత్రం గం.6.01 ని.ల నుంచి గం.7.38 ని.ల వరకు
వర్జ్యం: మధ్యాహ్నం గం. 12.23 ని.ల నుంచి గం.1.59 ని.ల వరకు
దుర్ముహూర్తం: ఉదయం గం.8.24 ని.ల నుంచి గం.9.17 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.12.47 ని.ల నుంచి గం.1.40 ని.ల వరకు
రాహుకాలం: ఉదయం గం.10.42 ని.ల నుంచి గం. 12.21 ని.ల వరకు
సూర్యోదయం: తె.వా. గం. 5.47 ని.లకు
సూర్యాస్తమయం :సా. గం.6.55 ని.లకు
మేషం:
అత్యవసర వేళలో ధైర్యసాహసాలను ప్రదర్శిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో మీ బుద్ధి కుశలతకు గుర్తింపు లభిస్తుంది. కీలక కబురు అందుకుంటారు. సోదరుల వల్ల మేలు జరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.
వృషభం:
అనుకున్నవి జరగవు. కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. ముఖ్యులతో ఆచితూచి మాట్లాడాలి. ఆర్థిక వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఖర్చులు బాగా పెరుగుతాయి. కుటుంబ సభ్యుల తీరు బాధిస్తుంది.
మిథునం:
ఆశించిన రీతిలోనే పనులు జరుగుతాయి. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. బాధ్యతల నిర్వహణలో ప్రశంసలు అందుకుంటారు. విందు భోజనముంటుంది. సౌఖ్యాన్ని పొందుతారు.
కర్కాటకం:
కొన్ని ఆటంకాలు ఇబ్బంది పెడతాయి. ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగులు దండనకు గురయ్యే సూచన ఉంది. వేళకు భోజనముండదు. అసూయను వదలండి.
సింహం
రోజంతా ఆనందంగా గడుపుతారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఆకాంక్ష నెరవేరుతుంది. ఆశించిన ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. ఉద్యోగులకు రివార్డులు అందుతాయి. గృహనిర్మాణ యత్నాలకు అనుకూలం.
కన్య
అన్నింటా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వం నుంచి దక్కాల్సిన ప్రయోజనాలను పొందుతారు. ఉన్నత స్థానాల్లోని వారికి శుభ ఫలితాలుంటాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది.
తుల
భాగస్వామ్య వ్యవహారాల్లో జాగ్రత్త. అగ్రిమెంట్లు కుదుర్చుకోవడానికి అనువైన సమయం కాదు. పిత్రార్జిత వ్యవహారాలు ముందుకు సాగవు. దూర ప్రయాణాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు, శత్రుపీడ పెరుగుతాయి.
వృశ్చికం
చెప్పుడు మాటల వల్ల అపోహలు పెరుగుతాయి. ఇతరులపై దురభిప్రాయాలను ఏర్పరచుకుంటారు. అధికారుల ఆగ్రహానికి గురవుతారు. మర్మాంగ సంబంధ సమస్యలు గోచరిస్తున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్త.
ధనుస్సు
శుభప్రదంగా ఉంటుంది. చిత్తశుద్ధితో చేసే పనుల్లో విజయం లభిస్తుంది. పెద్దల ప్రశంసలను పొందుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. జీవత భాగస్వామితో బంధం బలపడుతుంది.
మకరం:
అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక చికాకులు తొలగుతాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. శారీరక, మానసిక ప్రశాంతతను పొందుతారు. పుణ్య, దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మెరుగవుతుంది.
కుంభం:
మీ మేధస్సుకు తగిన గుర్తింపు లభించదు. ఇష్టకార్యమూ భంగమవుతుంది. నిరాశ చెందకండి. స్థిరచిత్తంతో విధులను నిర్వర్తించండి. సంతానం వ్యవహారాలపై శ్రద్ధ పెట్టండి. అనవసర వ్యవహారాల్లో జోక్యం వద్దు.
మీనం:
వ్యవహారాలు ఆశించిన రీతిలో సాగవు. అడ్డంకులను దాటాల్సి వుంటుంది. భూ సంబంధ వ్యవహారాలు వివాదాలకు దారితీస్తాయి. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. ర్చులు తగ్గించండి. మనశ్శాంతి లోపిస్తుంది.