Horoscope Today: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?

Horoscope Today: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?

Update: 2024-06-14 00:30 GMT

Horoscope Today: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?

తేది: 14-06-2024 (శుక్రవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, శుక్ల పక్షం

తిధి : అష్టమి అర్ధరాత్రి గం.12.03 ని.ల వరకు ఆతర్వాత నవమి

నక్షత్రం: ఉత్తర పూర్తి

అమృతఘడియలు: అర్ధరాత్రి గం.12.06 ని.ల నుంచి గం.1.55 ని.ల వరకు

వర్జ్యం: మధ్యాహ్నం గం.1.16 ని.ల నుంచి గం.3.04 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉ.గం. 8.20 ని.ల నుంచి గం.9.12 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.12.43 ని.ల నుంచి గం.1.36 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.10.38 ని.ల నుంచి మధ్యాహ్నం గం.12.17 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం.5.42 ని.ల కు

సూర్యాస్తమయం : సా. గం. 6.51 ని.లకు


మేషం :

ఆశించిన ఫలితాలను పొందుతారు. కీలక వ్యవహారంలో విజయం వరిస్తుంది. బంధువుల తోడ్పాటు లభిస్తుంది. డబ్బుకి ఇబ్బంది ఉండదు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యాల్లో పాల్గొంటారు.


వృషభం :

కార్యనష్టం గోచరిస్తోంది. జీవిత భాగస్వామి ఆకాంక్షను నెరవేర్చే యత్నం ఫలించదు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వల్ల సమస్యలొస్తాయి. భయాందోళనలు పెరుగుతాయి. శివుడిని పూజించడం మేలు చేస్తుంది.  


మిథునం :

పనికి అడ్డంకులొస్తాయి. వ్యవహారాలు సవ్యంగా సాగవు. ఆస్తి విషయాలు బెడిసికొడతాయి. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సాంత్వన కోసం దుర్గాదేవిని పూజించడం మంచిది.  


కర్కాటకం:

ప్రయోజనాలు నెరవేరతాయి. అన్ని వైపులా సహకారాలు లభిస్తాయి. ధనాదాయం ఉంటుంది. మిత్రుల వల్ల లబ్ది చేకూరుతుంది. కొత్త వస్తువులను కొంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.  


సింహం :

అభీష్టం నెరవేరడానికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. అడుగడుగునా ఆటంకాలు వస్తాయి. నిందలనూ భరించాల్సి వస్తుంది. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఉపశమనానికి లక్ష్మీనృసింహుడిని పూజించండి.


కన్య :

అన్నివిధాలా బాగుంటుంది. గౌరవం వృద్ధి చెందుతుంది. ఉద్యోగస్తులకు పురోభివృద్ధి ఉంటుంది. ధనలాభం ఉంది. మానసిక స్థితి ఉత్సాహకరంగా ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.  


తుల :

తలపెట్టిన కార్యాలేవీ ఫలించవు. ఆటంకాలు సృష్టించేవారు ఎక్కువవుతారు. ఇతరుల వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మిత్రులతోనూ విరోధం గోచరిస్తోంది. అమ్మవారిని పూజించడం మేలు చేస్తుంది. 


వృశ్చికం :

అభీష్టం నెరవేరుతుంది. డబ్బు చికాకులు తగ్గుతాయి. కాలం ఆనందమయంగా సాగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి. ఉద్యోగులకు శుభం. ఆరోగ్యం మెరుగవుతుంది.


ధనుస్సు :

ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు శుభప్రదంగా ఉంటుంది. పోటీదారులు పక్కకు తప్పుకుంటారు. గౌరవం పెరుగుతుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. విందుల్లో పాల్గొంటారు. ఇంట్లో శాంతి ఉంటుంది.  


మకరం :

తొందరపాటు నిర్ణయాల వల్ల విచారించాల్సి వస్తుంది. సంతానంతో విరోధం గోచరిస్తోంది. బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. దూర ప్రయాణాల వల్ల ప్రయోజనం లేదు. సుబ్రహ్మణ్యస్వామిని దర్శించండి.


కుంభం :

ఆశించినట్లుగా పనులు సాగవు. నిర్దేశిత సౌకర్యాలు సమకూరవు. తగాదాలకు ఆస్కారం ఉంది. మాట తూలకండి. ఇతరులపై దురభిప్రాయం ఏర్పడుతుంది. సాంత్వన కోసం శ్రీవేంకటేశ్వరస్వామిని పూజించండి.


మీనం :

ప్రయత్నాలు సఫలమవుతాయి. ధన సంబంధ చికాకులు తొలగుతాయి. బంధాలు దృఢపడతాయి. శారీరక, మానసిక సౌఖ్యం పొందుతారు. ప్రయాణాలు ఆనందకరంగా సాగుతాయి. కీర్తి వృద్ధి చెందుతుంది.

Tags:    

Similar News