Horoscope Today: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?

Horoscope Today: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?

Update: 2024-06-13 00:30 GMT

Horoscope: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?

తేది: 13-06-2024 (గురువారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, శుక్ల పక్షం

తిధి : సప్తమి రా.గం. 9.33 ని.ల వరకు ఆ తర్వాత అష్టమి

నక్షత్రం: పుబ్బ రేపు. తె.వా. గం.5.08 ని.ల వరకు ఆ తరవాత ఉత్తర

అమృతఘడియలు: రా. గం.9.57 ని.ల నుంచి గం.11.45 ని.ల వరకు

వర్జ్యం: ఉ. గం.11.11 ని.ల నుంచి మధ్యాహ్నం గం.12.59 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉ. గం.10.05 ని.ల నుంచి గం. 10.57 ని.ల వరకు మళ్లీ మధ్నాహ్నం గం.3.21 ని.ల నుంచి గం.4.13 ని.ల వరకు

రాహుకాలం : మధ్నాహ్నం గం.1.55 ని.ల నుంచి గం. 3.34 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 5.42 ని.ల కు

సూర్యాస్తమయం : సా. గం. 6.51 ని.ల కు


మేషం :

అనుకున్నట్లుగా పనులు సాగవు. మీకు తగిన గుర్తింపు లభించదు. సంతానం శైలి చికాకు పరుస్తుంది. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఆలోచనలు సవ్యరీతిలో సాగవు. అమ్మవారిని పూజించడం మేలు.


వృషభం :

ప్రతి పనికీ అడ్డంకి వస్తుంది. కార్యనష్టాలతో నిరాశ అలముకుంటుంది. మిత్రుల తోడ్పాటు లభిస్తుంది. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. ఆస్తి అమ్మే ప్రయత్నం ఫలించదు. శివుణ్ణి పూజించడం మేలు చేస్తుంది. 


మిథునం :

ఉత్సాహంగా గడుస్తుంది. వ్యవహారాల్లో విశేష లాభం ఉంటుంది. ఆత్మీయులను కలుస్తారు. విందుల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కొత్త వస్తువులు కొంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.


కర్కాటకం:

విఘ్నాలు ఎక్కువవుతాయి. అనవసర జోక్యాలు చేటు తెస్తాయి. ఆర్థిక క్రమశిక్షణ లోపించడంతో చిక్కులొస్తాయి. వేళకు భోజనం ఉండదు. మానసిక అశాంతి కలుగుతుంది. గణపతిని పూజించడం మేలు. 


సింహం :

ఆనందభరితంగా గడుపుతారు. ధనలాభం ఉంది. వాహన యోగం ఉంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. కార్యదక్షతతో ప్రశంసలు అందుకుంటారు. విందుల్లో పాల్గొంటారు. కొత్త బాధ్యతలను స్వీకరించే వీలుంది.  


కన్య :

ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యవహార నష్టం దిగులు కలిగిస్తుంది. విపరీతమైన ఖర్చులు విసిగిస్తాయి. మిత్రులతోనూ విరోధం గోచరిస్తోంది. మాటలు తూలకండి. కనకదుర్గమ్మను పూజించండి.


తుల :

రోజంతా సంతోషంగా గడుపుతారు. ఇష్టమైన వారితో విందు వినోదాల్లో గడుపుతారు. ధన సంబంధ చికాకులు తొలగుతాయి. అవసరమైన సౌకర్యాలు సమకూరతాయి. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి.


వృశ్చికం :

ఎదుగుదలకు చక్కటి అవకాశం అందివస్తుంది. సద్వినియోగం చేసుకోండి. కొత్త బాధ్యతలు స్వీకరించే వీలుంది. గృహశాంతి ఉంటుంది. అధికారుల అభిమానాన్ని పొందుతారు. శత్రవుల మీద పైచేయి సాధిస్తారు. 


ధనుస్సు :

ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి. అధికారుల ఆగ్రహానికి గురవుతారు. దూరప్రాంతాలకు వెళ్లే సూచన ఉంది. సంతానంతో గొడవ వస్తుంది. వృథా ఖర్చులుంటాయి. అశాంతి ఏర్పడుతుంది. శివుడిని అర్చించండి.


మకరం :

పనులు అనుకున్నట్లు సాగవు. ఇతరులపై దురభిప్రాయం ఏర్పడుతుంది. స్వల్ప తగాదాలు వస్తాయి. తొందర పాటు నిర్ణయాలు తీసుకోకండి. ప్రయాణాల్లో జాగ్రత్త. ఆంజనేయస్వామిని పూజించడం మేలు.


కుంభం :

తలచిన పనులు చకచకా పూర్తవుతాయి. డబ్బుకి సమస్య ఉండదు. నూతన వస్తువులను కొంటారు. కొత్త విషయాలు తెలుస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఇరుగు పొరుగుతో సత్సంబంధాలు ఉంటాయి.  


మీనం :

ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు శుభప్రదంగా ఉంటుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. శత్రువులు తోక ముడుస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పుణ్య కార్యాల్లో పాల్గొంటారు.

Tags:    

Similar News