Horoscope: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?
Horoscope: ఈ రోజు మీ రాశిఫలం ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?
తేది: 12-06-2024 (బుధవారం)
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, శుక్ల పక్షం
తిధి : షష్ఠి రా.గం.7.16 ని.ల వరకు తర్వాత సప్తమి
నక్షత్రం: మఖ రేపు తె.వా. గం.2.12 ని.ల వరకు
అమృతఘడియలు: రాత్రి గం.11.33 ని.ల నుంచి రేపు తె.వా.గం. 1.19 ని.ల వరకు
వర్జ్యం: మధ్యాహ్నం గం.12.55 ని.ల నుంచి గం.2.42 ని.ల వరకు
దుర్ముహూర్తం : ఉదయం గం.11.50 ని.ల నుంచి గం.12.43 ని.ల వరకు
రాహుకాలం : మధ్యాహ్నం గం.12.16 ని.ల నుంచి గం.1.55 ని.ల వరకు
సూర్యోదయం : తె.వా. గం 5.41 ని.లకు
సూర్యాస్తమయం : సా. గం.6.51 ని.లకు
మేషం :
అకారణ విరోధాలు మానసిక వేదనను కలిగిస్తాయి. అభీష్టం నెరవేరదు. మీ సమర్థతకు తగినంత గుర్తింపు లభించదు. అనుమానాలు పెరుగుతాయి. ఖర్చులు అదుపు తప్పుతాయి. సూర్యారాధన మేలు చేస్తుంది.
వృషభం :
ఆటంకాలు పెరుగుతాయి. కార్య, వ్యవహార నష్టాలు గోచరిస్తున్నాయి. ఆస్తి క్రయవిక్రయాలు పెద్దగా లాభించవు. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. శ్రీనివాసుడిని పూజించండి.
మిథునం :
కార్యాల్లో విశేష లాభం ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. మానసిక ప్రశాంతతను పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దగ్గరి ప్రయాణాలు లాభిస్తాయి. ఆత్మీయుల కలయిక ఆనందాన్నిస్తుంది.
కర్కాటకం:
ఆర్థిక లావాదేవీల్లో చికాకులొస్తాయి. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా ఉంటాయి. కుటుంబ సమస్యలను జీవిత భాగస్వామి తోడ్పాటుతో పరిష్కరించండి. అనవసరంగా మాట తూలకండి. గణపతిని పూజించండి
సింహం :
అభీష్టం నెరవేరుతుంది. మానసిక స్థితి ఉత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. విందుల్లో పాల్గొంటారు. ప్రశంసలందుకుంటారు. కుటుంబ వ్యవహారాలు సజావుగా సాగుతాయి.
కన్య :
పనులు సవ్యంగా సాగక పోవడం మానసిక దిగులుకు కారణమవుతుంది. బద్ధకాన్ని వదిలిపెట్టాలి. వేళకు భోజనం ఉండదు. దూర ప్రాంతాలకు వెళ్లే సూచన ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త. వేంకటేశుని పూజించండి.
తుల :
ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఇరుగుపొరుగుతో సఖ్యత ఏర్పడుతుంది. అవసరమైన సౌకర్యాలు సమకూరతాయి. విందుల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బావుంటుంది.
వృశ్చికం :
అన్ని పనుల్లో విజయం సిద్ధిస్తుంది. కొత్త బాధ్యతలను చేపడతారు. శత్రువులు తోకముడుస్తారు. పెద్దల ఆదరాభిమానాలను పొందుతారు. ఇంట్లో శాంతి ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కీర్తి వృద్ధి ఉంది.
ధనుస్సు :
వ్యవహారాలు అనుకున్న రీతిలో సాగవు. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. తండ్రితో సఖ్యత చెడుతుంది. కడుపులో ఇబ్బంది ఉంటుంది. బాధ్యతల నుంచి వైదొలగాల్సి రావచ్చు. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి.
మకరం :
ఆటంకాలుంటాయి. చెప్పుడు మాటలు విని అపోహలు పెంచుకుంటారు. స్వల్ప తగాదాలు గోచరిస్తున్నాయి. అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండండి. సుబ్రహ్మణ్యుణ్ణి పూజించండి.
కుంభం :
చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థికంగా బాగానే ఉంటుంది. ప్రయాణాలు ఆనందకరంగా ఉంటాయి. ఇరుగు పొరుగుతో సత్సంబంధాలు ఉంటాయి. శారీరక సౌఖ్యం పొందుతారు. కీర్తి పెరుగుతుంది.
మీనం :
అభీష్టం నెరవేరుతుంది. స్వస్థాన ప్రాప్తి ఉంది. ధనలాభం ఉంది. బంధు, కీలక వ్యవహారాల్లో మిత్రుల తోడ్పాటు లభిస్తుంది. కొత్త వస్తువులను కొంటారు. ప్రశంసలు పొందుతారు. శభ కార్యాల్లో పాల్గొంటారు.