Daily Horoscope Today: నేటి రాశి ఫలాలు...19-06-2024 బుధవారం
Daily Horoscope Today: నేటి రాశి ఫలాలు...19-06-2024 బుధవారం
19-06-2024 (బుధవారం)
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, శుక్లపక్షం
తిధి : ద్వాదశి ఉదయం గం.7.28 ని.ల వరకు తర్వాత త్రయోదశి
నక్షత్రం: విశాఖ సాయంత్రం గం.5.23 ని.ల వరకు తర్వాత అనూరాధ
అమృతఘడియలు: ఉదయం గం.8.03 ని.ల నుంచి గం.9.45 ని.ల వరకు
వర్జ్యం: రాత్రి గం.9.31 ని.ల నుంచి గం. 11.10 ని.ల వరకు
దుర్ముహూర్తం : ఉదయం గం.11.51 ని.ల నుంచి గం. 12.44 ని.ల వరకు
రాహుకాలం : మధ్యాహ్నం గం.12.18 ని.ల నుంచి గం. 1.56 ని.ల వరకు
సూర్యోదయం : తె.వా. గం. 5.43 ని.లకు
సూర్యాస్తమయం :సా. గం. 6.53 ని.లకు
మేషం :
చేపట్టిన పని పూర్తికి బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగులు అధికారుల కోపానికి గురయ్యే సూచన ఉంది. చెప్పుడు మాటలు వినకండి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండడం మేలు.
వృషభం :
ఉల్లాసంగా ఉంటారు. పనులు ఆశించినట్లే పూర్తవుతాయి. కొత్త వస్తువులు కొంటారు. బంధాలు బలంగా ఉంటాయి. జీవిత భాగస్వామి తోడుంటారు. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ప్రశంసలొస్తాయి.
మిథునం :
చేపట్టి ప్రతి పనీ విజయవంత అవుతుంది. శుభ ఫలితాలను అందుకుంటారు. బంధు, మిత్రుల సహకారం లభిస్తుంది. శత్రుపీడ తొలగుతుంది. ధనలాభముంది. ఆరోగ్యం మెరుగవుతుంది. దైవకార్యాల్లో పాల్గొంటారు.
కర్కాటకం:
ఆటంకాలు ఉంటాయి. బద్ధకాన్ని వీడి కష్టపడితే ప్రయోజనం ఉంటుంది. కీలక నిర్ణయాల్లో ఆత్మీయుల సూచనలను పాటించండి. అనవసర జోక్యాల వల్ల విరోధాలు వస్తాయి. విలువైన వస్తువులు జాగ్రత్త.
సింహం :
వ్యవహారాలు సజావుగా సాగవు. ఆస్తి సంబంధ వ్యవహారాల్లో జాప్యం ఏర్పడుతుంది. ఆత్మీయులతో విరోధాలున్నాయి. అవమానాలకు గురయ్యే సూచన ఉంది. బుద్ధి నిలకడగా ఉండదు. ఖర్చులు తగ్గించండి.
కన్య :
విశేష లాభం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో చేపట్టే ప్రతి పనీ విజయవంతం అవుతుంది. నూతన వస్తుప్రాప్తి ఉంది. ఆదాయం కూడా మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆత్మశాంతిని పొందుతారు.
తుల :
అనుకున్నవి జరగవు. వ్యవహార నష్టం వల్ల మనసుకి కష్టం కలుగుతుంది. ఇతరుల కారణంగా నిందలు భరించాల్సి వస్తుంది. వేళకు భోజనం ఉండదు. ఆర్థిక ఇబ్బందులుంటాయి. ఖర్చులూ పెరుగుతాయి.
వృశ్చికం :
ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు అనుకున్నట్లే సాగుతాయి. ఉద్యోగులకు శుభవర్తమానం అందుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ప్రశంసలను అందుకుంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
ధనుస్సు :
వ్యవహార నష్టం గోచరిస్తోంది. అప్రమత్తంగా వ్యవహరించండి. బంధువులతో విరోధం ఏర్పడుతుంది. ఏమరుపాటు కారణంగా ఇబ్బందుల్లో పడే సూచన ఉంది. వేళకు భోజనం ఉండదు. ప్రయాణాలు వద్దు.
మకరం :
శుభప్రదంగా సాగుతుంది. ఆర్థిక చిక్కులు తొలగుతాయి. ఇష్టమైన వారితో విందుల్లో పాల్గొంటారు. ఇతరుల నుంచి సహకారం లభిస్తుంది. సంతానం వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. మానసిక ప్రశాంతత పొందుతారు.
కుంభం :
అనుకున్నట్లే పనులవుతాయి. అభీష్టం నెరవేరుతుంది. ఉద్యోగులకు బాగా యోగించే రోజిది. రివార్డులు పొందుతారు. శత్రుపీడ తొలగుతుంది. బంధువులతో వినోదాల్లో పాల్గొంటారు. గృహశాంతి ఉంటుంది.
మీనం :
పనులు సవ్యంగా సాగక పోవడం విచారాన్ని కలిగిస్తుంది. ఇంటికి దూరంగా ఉంటారు. గొడవలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత్త. బలహీనతలను బయటపెట్టకండి. ఉద్యోగస్తులు మరింత జాగ్రత్తగా ఉండాలి.