Daily Horoscope Today: నేటి రాశి ఫలాలు...18-06-2024 మంగళవారం

Daily Horoscope Today: నేటి రాశి ఫలాలు...18-06-2024 మంగళవారం

Update: 2024-06-18 00:30 GMT

Daily Horoscope Today: నేటి రాశి ఫలాలు...18-06-2024 మంగళవారం

18-06-2024 (మంగళవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, శుక్ల పక్షం

తిధి : ఏకాదశి ఉదయం గం.6.24 ని.ల వరకు ఆ తర్వాత ద్వాదశి

నక్షత్రం: స్వాతి మధ్యాహ్నం గం.3.56 ని.ల వరకు ఆ తర్వాత విశాఖ

అమృతఘడియలు: ఉదయం గం.6.22 ని.ల నుంచి గం.8.06 ని.ల వరకు

వర్జ్యం: రాత్రి గం.9.52 ని.ల నుంచి గం. 11.34 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.8.20 ని.ల నుంచి గం.9.13 ని.ల వరకు మళ్లీ రాత్రి గం.11.13 ని.ల నుంచి గం.11.56 ని.ల వరకు

రాహుకాలం : సా. గం.3.35 ని.ల నుంచి సా. గం.5.14 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం.5.42 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం.6.53 ని.లకు


మేషం :

ఇవాళ్టి వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భాగస్వాములతో సఖ్యత ఏర్పడుతుంది. బంధాలు దృఢపడతాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. విందుల్లో పాల్గొంటారు.


వృషభం :

పనులు అనుకున్నట్లే సాగుతాయి. డబ్బు సమస్య ఉండదు. అన్నిచోట్లా శుభ ఫలితాలే అందుతాయి. స్వస్థాన ప్రాప్తి ఉంది. బంధుమిత్రుల సహకారం ఉపయోగపడుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.


మిథునం :

ఆచితూచి అడుగులు వేయండి. పనులు సకాలంలో పూర్తి చేయలేక పోతారు. శత్రుత్వాలు పెరుగుతాయి. ఒత్తిడి పెరుగుతుంది. బద్ధకాన్ని దూరం పెట్టండి. ఖర్చులు తగ్గించుకోండి. కనక దుర్గమ్మను పూజించండి.


కర్కాటకం:

పనులు అనుకున్న రీతిలో సాగవు. ధన సంబంద చికాకులూ ఉంటాయి. అశాంతి పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలు ముందుకు సాగవు. వృథా ఖర్చులు చేస్తారు. సాంత్వనకు పరమశివుణ్ణి పూజించండి.


సింహం :

ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. సన్నిహితుల తోడ్పాటు లభిస్తుంది. కుటుంబ చికాకులు తొలగుతాయి. కీలక సమాచారం అందుతుంది. కీర్తి పెరుగుతుంది. ఆత్మశాంతిని పొందుతారు.  


కన్య :

పనులు అనుకున్నట్లుగా సాగవు. ఆర్థిక లావాదేవీలు చికాకు పెడతాయి. ఇతరుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. మానసిక అశాంతి పెరుగుతుంది. ఖర్చులు తగ్గించండి. శ్రీనివాసుని పూజించండి.


తుల :

రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అనుకున్న కార్యాలన్నీ సవ్యంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. విందుల్లో పాల్గొంటారు. కార్యదక్షతకు ప్రశంసలను అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది.


వృశ్చికం :

అసహనాన్ని తగ్గించుకోవాలి. ఇతరులను నిందించడం వల్ల ప్రయోజనం ఉండదు. అసూయతో పాటు ఖర్చులు అదుపు చేయాలి. దూర ప్రాంతాలకు వెళ్లే సూచన ఉంది. లక్ష్మీనృసింహస్వామిని పూజించండి.


ధనుస్సు :

కొత్త విషయాలు తెలుస్తాయి. నూతన పరిచయాల లాభదాయకంగా ఉంటాయి. బంధువుల నుంచి అవసరమైన సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు.


మకరం :

అభీష్టం నెరవేరుతుంది. ప్రతిపనీ సఫలమవుతుంది. అవకాశాలు అందివస్తాయి. ఉద్యోగులకు కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. శత్రుపీడ తొలగుతుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. గౌరవం పెరుగుతుంది.


కుంభం :

కార్యసాధనకు బాగా శ్రమించాల్సి వుంటుంది. వైఫల్యాలు అశాంతిని కలిగిస్తాయి. పిత్రార్జిత వ్యవహారాల్లో చికాకులు తలెత్తుతాయి. బలహీనతలను సరిచేసుకోవాలి. సాంత్వనకు ఆంజనేయ స్వామిని పూజించండి.  


మీనం :

అనుకున్న సమయానికి పనులు పూర్తి కావు. అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఇష్టంలేని పనులు చేయాల్సి వస్తుంది. తగాదాలూ గోచరిస్తున్నాయి. వేళకు భోజనం ఉండదు. శివారాధన మేలు చేస్తుంది.

Tags:    

Similar News