Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 3 July 2024
Today Horoscope in Telugu 3 July 2024: ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు.
03-07-2024 (బుధవారం)
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, కృష్ణ పక్షం
తిధి : ద్వాదశి ఉ. గం.7.10 ని.ల వరకు ఆ తర్వాత త్రయోదశి
నక్షత్రం: రోహిణి రేపు తె.వా. గం.4.07 ని.ల వరకు ఆ తర్వాత మృగశిర
అమృతఘడియలు: అర్ధరాత్రి గం.1.00 ని.ల నుంచి గం.2.33 ని.ల వరకు
వర్జ్యం: రాత్రి గం.8.18 ని.ల నుంచి గం.9.52 ని.ల వరకు
దుర్ముహూర్తం : ఉదయం గం.11.54 ని.ల నుంచి గం.12.47 ని.ల వరకు
రాహుకాలం : మధ్యాహ్నం గం.12.21 ని.ల నుంచి గం.1.59 ని.ల వరకు
సూర్యోదయం : తె.వా. గం.5.46 ని.లకు
సూర్యాస్తమయం :సా. గం. 6.55 ని.లకు
మేషం :
బ్యాంకు వ్యవహారాలు చికాకు పెడతాయి. వ్యవహారాలు అనుకున్నట్లుగా సాగవు. అకారణ నిందలు, తగాదాలు మనసుకి కష్టం కలిగిస్తాయి. పూచీల వల్ల సమస్యలొస్తాయి. వృథా ఖర్చులను తగ్గించాలి.
వృషభం :
ఉత్సాహంగా గడుపుతారు. అభీష్టం నెరవేరుతుంది. విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఉద్యోగులు ప్రశంసలను పొందుతారు. భాగస్వామ్య వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.
మిథునం :
నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. బంధువులతో విరోధం, ఇబ్బందులు ఉంటాయి. అయినవారి వైద్యానికి ఖర్చు చేయాల్సి రావచ్చు. వీలైనంత మేరకు ప్రయాణాలు వాయిదా వేసుకోండి.
కర్కాటకం:
రోజంతా సంతోషంగా ఉంటారు. పనులు అభీష్టానికి తగ్గట్లే సఫలమవుతాయి. డబ్బు సమస్యలు ఉండవు. శారీరక, మానసిక శాంతిని పొందుతారు. విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు.
సింహం :
స్థిరత్వం పెరుగుతుంది. అన్ని వ్యవహారాలూ సజావుగా సాగుతాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అధికారుల అభిమానాన్ని పొందుతారు. కొత్త బాధ్యతలు వస్తాయి. గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి.
కన్య :
కాస్త జాప్యమైనా అభీష్టం నెరవేరుతుంది. భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు. బలహీనతలను బయట పెట్టకండి. ఉన్నత విద్యకు చేసే ప్రయత్నాలకు ఆటంకం ఉంటుంది. వృథా ఖర్చులు చికాకు పరుస్తాయి.
తుల :
ప్రతికూల ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. అప్రమత్తంగా వ్యవహరించండి. తగాదాలకు దూరంగా ఉండండి. చెప్పుడు మాటలు వినకండి. విధి నిర్వహణలో బద్ధకాన్ని వదలండి. అనవసర ఖర్చులను తగ్గించుకోండి.
వృశ్చికం :
మానసిక శాంతి ఉంటుంది. ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఇరుగుపొరుగుతో సత్సంబంధాలు ఏర్పడతాయి. భాగస్వామ్య వ్యవహారాలు మెరుగు పడతాయి.
ధనుస్సు :
కార్యజయం ఉంది. అన్ని వ్యవహారాలూ మీ అభీష్టం మేరకే జరుగుతాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. రుణదాతల ఒత్తిడి తగ్గుతుంది. గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం బావుంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు.
మకరం :
ఆటంకాలను అధిగమించాల్సి వుంటుంది. అభీష్టం నెరవేరదు. విరోధాలు పెరిగే సూచన ఉంది. సొంత తెలివితేటలతో నిర్ణయాలు తీసుకోకండి. ఆత్మీయుల సూచనలు పాటించండి. నిరాశను వదిలి సాగండి.
కుంభం :
స్థిరాస్తి వ్యవహారాలు ముందుకు సాగవు. విద్యావ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. మనసు నిలకడగా ఉండదు. మానసిక ప్రశాంతత కరువవుతుంది. బద్ధకం వదిలి కృషి చేయండి.
మీనం :
ఆత్మవిశ్వాసంతో చేపట్టే ప్రతి పనీ ఫలిస్తుంది. ఆదాయం మెరుగవుతుంది. శుభవర్తమానం అందుతుంది. కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. పరిచయాలు బలపడతాయి. ఆత్మధైర్యం వృద్ధి చెందుతుంది.