ఏపీలో టీడీపీ వర్సెస్ మహిళా కమిషన్.. అగౌరవపరిచేలా మాట్లాడారని...
AP News: విచారణకు హాజరుకాకపోతే పీఎస్‌లో ఫిర్యాదు చేసే యోచనలో మహిళా కమిషన్...
AP News: రాష్ట్రంలో సమస్య ఏదైనా ఏపీ సర్కార్ వెంటనే స్పందిస్తోంది. ఇప్పటికే విజయవాడ ప్రభుత్వాస్పత్రి ఘటనపై సీఎం జగన్ సీరియస్ కావడంతో.. దర్యాప్తు చేసిన ఉన్నతాధికారులు నిందితులను అదుపులోకి తీసుకోవడమే గాక, నిర్లక్ష్యం వహించిన వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే నిన్న అత్యాచార బాధితురాలి పరామర్శల వేదికగా పొలిటికల్ హీట్ మరింత పెరిగింది.
చంద్రబాబు, బోండా ఉమా వాసిరెడ్డి పద్మను అగౌరపరిచేలా మాట్లాడారని.. మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 27న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అంతేకాదు విచారణకు హాజరుకాకపోతే పీఎస్‌లో కంప్లైంట్ చేసే యోచనలో మహిళా కమిషన్ ఉన్నట్లు సమాచారం.