Perni Nani With RGV: రాంగోపాల్ వర్మ చెప్పాల్సింది చెప్పారు
Perni Nani With RGV: రాంగోపాల్ వర్మ చెప్పాల్సింది చెప్పారని మంత్రి పేర్ని నాని అన్నారు.

Perni Nani With RGV: రాంగోపాల్ వర్మ చెప్పాల్సింది చెప్పారు
Perni Nani With RGV: రాంగోపాల్ వర్మ చెప్పాల్సింది చెప్పారని మంత్రి పేర్ని నాని అన్నారు. 1956 సినిమాటోగ్రఫి చట్టం ప్రకారమే టికెట్ ధరలు ఉన్నాయని మంత్రి క్లారిటీ ఇచ్చారు. అన్ని వివరంగా విన్నానని అన్ని చట్ట ప్రకారమే జరుగుతున్నాయన్నారు. సినిమా టికెట్ అంశానికి సంబంధించి కమిటీ ఏర్పాటు చేశామన్నారు.
కమిటీ సూచనల ప్రకారం తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని పేర్నినాని వెల్లడించారు. ఆర్జీవీ చెప్పిన అంశాలను ఉన్నత స్థాయి కమిటీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా సినిమా థియేటర్లకు 50 శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతిస్తున్నామని అందరూ సహకరించాలని మంత్రి పేర్ని నాని విజ్ఞప్తి చేశారు.