CBI: విశాఖపట్టణం కంటైనర్ లో డ్రగ్స్ లేవని తేల్చిన సీబీఐ
Visakhapatnam Port: విశాఖపట్టణం కంటైనర్ లో డ్రగ్స్ లేవని సీబీఐ తేల్చింది. ఈ ఏడాది మార్చిలో ఈ కంటైనర్ విశాఖకు చేరుకుంది.
Visakhapatnam Port: విశాఖపట్టణం కంటైనర్ లో డ్రగ్స్ లేవని సీబీఐ తేల్చింది. ఈ ఏడాది మార్చిలో ఈ కంటైనర్ విశాఖకు చేరుకుంది. ఆ సమయంలో ఈ కంటైనర్ లో డ్రగ్స్ ఉన్నాయని అప్పట్లో ప్రచారం సాగింది. దీనిపై రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. బ్రెజిల్ నుంచి వచ్చిన ఈ కంటైన్ లో 25 వేల టన్నుల డ్రైడ్ ఈస్ట్ లో డ్రగ్స్ ఉన్నాయని అప్పట్లో సీబీఐ అధికారులు సీజ్ చేశారు. ఈ శాంపిల్స్ ను దిల్లీలోని ల్యాబ్ కు పంపించారు. అయితే ఈ శాంపిల్స్ ను పరిశీలించిన ల్యాబ్ ఇందులో ఎలాంటి డ్రగ్స్ అవశేషాలు లేవని తేల్చింది. ఈ రిపోర్ట్ ను సీబీఐ అధికారులు కోర్టుకు అందించారు. ఈ కంటైనర్ ను సంధ్యా ఆక్వాకు అప్పగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లోని సంధ్యా ఆక్వా ప్రతినిధులు బ్రెజిల్ నుంచి డ్రైడ్ ఈస్ట్ ఆర్డర్ పెట్టారు. 2024 మార్చి 16న కంటైనర్ లో ఇది చేరుకుంది. దీనిపై ఇంటర్ పోల్ సమాచారం ఆధారంగా సీబీఐ అధికారులు కంటైనర్ ను తనిఖీ చేశారు. ఇందులోని శాంపిల్స్ ను తీసుకొని ల్యాబ్ కు పంపారు. ఎనిమిది నెలల తర్వాత ఇందుకు సంబంధించిన నివేదిక ల్యాబ్ అందించింది. ఈ కంటైనర్ అంశం అప్పట్లో టీడీపీ, వైఎస్ఆర్ సీపీ ల మధ్య విమర్శలకు దారి తీసింది.