ఆరేళ్లైనా ఇంకా న్యాయం జరగలేదు: వైఎస్ వివేకా హత్యపై సునీతా

Sunitha: వివేకానందరెడ్డి మరణించి ఆరేళ్లు అవుతున్నా ఇంకా న్యాయం జరగలేదని వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Update: 2025-03-15 06:08 GMT

Sunitha: వివేకానందరెడ్డి మరణించి ఆరేళ్లు అవుతున్నా ఇంకా న్యాయం జరగలేదని వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వివేకానందరెడ్డి ఆరవ వర్ధంతిని పురస్కరించుకొని పులివెందులలో ఆయన సమాధి వద్ద సునీతా రెడ్డి నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో ఒక్కరు మినహా మిగిలినవారంతా బయట తిరుగుతన్నారని ఆమె చెప్పారు. దర్యాప్తు ముందుకు సాగకుండా నిందితులు చట్టంలోని అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నారని ఆమె అన్నారు. దర్యాప్తు ముందుకు సాగకుండా నిందితులు మేనేజ్ చేస్తున్నారనే అనుమానం కలుగుతోందని ఆమె ఆరోపించారు.

ఈ కేసులో సాక్షులు, నిందితులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సునీతా రెడ్డి అన్నారు.దర్యాప్తు ఎందుకు ఆగిపోయింది, కోర్టులో ట్రయల్ ప్రారంభం కాలేదు.. ఇవన్నీ చూస్తే న్యాయం జరుగుతుందా అనే అనుమానం కలుగుతోందన్నారు. వివేకానందరెడ్డి కుటుంబానికే న్యాయం జరగలేదు. మరో కుటుంబానికి న్యాయం జరుగుతుందా అని ఆమె ప్రశ్నించారు. ఈ హత్య కేసు విషయంలో తన పోరాటం కొనసాగిస్తానని ఆమె చెప్పారు.

Tags:    

Similar News