నేడు ప్రపంచ జనాభా దినోత్సవం.

నేడు ప్రపంచ జనాభా దినోత్సవం.
x
Highlights

నేడు ప్రపంచ జనాభా దినోత్సవం. మంది ఎక్కువ అయితే మజ్జిగ పలచన అవుతుంది అంటారు, అలాంటి పరిస్థితిలోనే ప్రస్తుతం మన భూమాత కష్టపడుతూవుంది. ఇది అర్ధం...

నేడు ప్రపంచ జనాభా దినోత్సవం.

మంది ఎక్కువ అయితే మజ్జిగ పలచన అవుతుంది అంటారు, అలాంటి పరిస్థితిలోనే ప్రస్తుతం మన భూమాత కష్టపడుతూవుంది. ఇది అర్ధం చేసుకోడానికి ఒక కథ విందాం...

ఒక ప్రాంతంలో ఒక మనిషి ఉండేవాడు, అతను రోజు ఆకలి కాగానే పక్కనే వున్నా చెట్టు యొక్క పండ్లు తిని బ్రతికే వాడు.అతనికి కావలసినన్ని పండ్లు ఆ చెట్టు ఇచ్చేది. కొద్ది రోజుల తర్వాత అతనికి పెండ్లి అయ్యింది... తన వద్ద వున్న పండ్లలో సగం భార్యకిచ్చి, సగం తాను తినేవాడు. కొన్నాళ్ల తర్వాత ఒక బాబు పుట్టాడు వారికీ. తమ చెట్టులో వచ్చే పండ్లనే పంచుకొని ముగ్గురు తినసాగారు. తర్వాత వారికీ ఒక పాపా పుడితే, వున్నపండ్లనే నాలుగు భాగాలు చేసి తినసాగరు . ఆ తర్వాత పుట్టే పిల్లలకి పండ్లు ఆహారంగా ఇద్దామన్న ఇవ్వలేని పరిస్థితి.... దీంతో ఎవరికీ ఆకలి తీరని పరిస్థితి వచ్చింది. అంటే వాళ్లింట్లో మనుషులు పెరిగారు, కాని పండ్ల ఉత్పత్తి పెరగడం లేదు.

ఇప్పుడు భూమి పరిస్థితి కూడా ఆ మనిషి ఇల్లు లాగే ఉంది. భూమి పై జనాభా కోట్లాదిగా పెరుగు పోతోంది. అందుకే చాలామందికి తిండి దొరకడం కష్టమై పోతోంది. కాబట్టి ఈ విషయంలో ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఏటా జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజే ఎందుకంటే, ప్రపంచ జనాభా 1987 జులై 11 నాటికి 500 కోట్లకు చేరుకుంది అని ప్రత్యేకంగా ఎంచుకున్నారు. మన ప్రపంచంలో ప్రతి సెకనుకు అయిదుగురు పుడుతుంటే, ఇద్దరు చనిపోతున్నారు. అంటే సెకనుకి ముగ్గురు చొప్పున జనాభా పెరుగుతోందన్న మాట. కాబట్టి జనాబా పెరుగుదలకి అనుగుణంగా వనరులు పెంచుకోవాల్సిన అవసరం వుంది అని గుర్తించాలి.

ప్రస్తుతం మన భూమిపై వున్నా జనాభా ప్రకారం..మొదటి మూడు దేశాలు

దేశము ------జనాభా కోట్లలో :

చైనా-----------142.00.

భారత్ ---------136.87

అమెరికా ------------32.90.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories