స్టార్ లను తీర్చిదిద్దిన స్టార్ డైరెక్టర్ పుట్టినరోజు నేడు.

స్టార్ లను తీర్చిదిద్దిన స్టార్ డైరెక్టర్ పుట్టినరోజు నేడు.
x
Highlights

స్టార్ లను తీర్చిదిద్దిన స్టార్ డైరెక్టర్ పుట్టినరోజు నేడు. కమలహసన్, రజనీకాంత్, ముమ్ముట్టిలను తీర్చిదిద్దింది ఆయనే.... జయసుధ, జయప్రద, శ్రీదేవి,...

స్టార్ లను తీర్చిదిద్దిన స్టార్ డైరెక్టర్ పుట్టినరోజు నేడు.

కమలహసన్, రజనీకాంత్, ముమ్ముట్టిలను తీర్చిదిద్దింది ఆయనే.... జయసుధ, జయప్రద, శ్రీదేవి, ప్రకాశరాజ్ ని మలచింది ఆయనే..దక్షిణాది సినిమా చరిత్రలో తనకంటూ ఒక గొప్ప స్థానం సంపాదించిన కళామతల్లి ముద్దుబిడ్డ.... కె.బాలచందర్ గారు. నేడు వారి పుట్టినరోజు. కె.బాలచందర్ గా ప్రసిద్ధిచెందిన కైలాసం బాలచందర్ ప్రముఖ దక్షిణ భారతదేశ సినిమా దర్శకుడు, రచయిత మరియు నిర్మాత అని సినిజగత్తు మొత్తం తెలుసు.

వీరు 1930 సంవత్సరంలో తంజావూరు దగ్గర నన్నిలం గ్రామంలో జన్మించారు. తొలుత అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయంలో పనిచేసేవాడు. అక్కడ ఉద్యోగం చేస్తూనే పలు నాటకాలు రాశాడు. ఎంజీఆర్‌ కథానాయకుడిగా నటించిన దైవతాయ్‌ చిత్రానికి సంభాషణల రచయితగా చలనచిత్ర రంగంలో ప్రస్థానం ప్రారంభించాడు. 45 ఏళ్లలో తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో 100కు పైగా చిత్రాలను రూపొందించాడు. భారత చలనచిత్ర రంగం అభివృద్ధికి ఆయన చేసిన కృషికి గాను 2010 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. వారు ఇప్పటి దర్శకులకు ఎందరికో ఆదర్శం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories