ఒంటరిలోనూ, ఓటమిలోను స్నేహం తోడై నడుస్తుంది

ఒంటరిలోనూ, ఓటమిలోను స్నేహం తోడై నడుస్తుంది
x
Highlights

గాడాంధకారం అలముకున్నా.. నిరాశా నిస్పృహలు చుట్టుముట్టినా.. భరించలేని కష్టం బాధపెట్టినా..నీ కోసం నేనున్నానంటూ వెన్ను తట్టే ఆత్మీయ స్పర్శే స్నేహం.....

గాడాంధకారం అలముకున్నా.. నిరాశా నిస్పృహలు చుట్టుముట్టినా.. భరించలేని కష్టం బాధపెట్టినా..నీ కోసం నేనున్నానంటూ వెన్ను తట్టే ఆత్మీయ స్పర్శే స్నేహం.. నిజమైన స్నేహం జీవితం చివరి వరకు తోడుటుంది.. ఒంటరిలోను, ఓటమిలోనూ తోడై నడుస్తుంది. కన్నీరు తుడుస్తుంది, కష్టాల్లో ధైర్యం చెబుతుంది.. అలాంటి మైత్రి లోని మాధుర్యం చెప్పడానికి మాటలు చాలవు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మన హితం కోరేవాడే స్నేహితుడు.. సంతోషాన్నయినా, విషాదాన్నయినా పంచుకునేది స్నేహితుల దగ్గరే. అందుకే శత్రువు ఒక్కడైనా ఎక్కువే... స్నేహితులు వందమంది అయినా తక్కువే అని స్వామి వివేకానంద అంటారు.. మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలుగా మారిపోయి, మనిషన్నవాడు మాయమైపోతున్న తరుణంలోనూ ఇంకా ఆత్మీయమైన స్నేహాలు, ఉన్నతమైన మానవతా విలువలు వెలుగు రేఖలుగా దారి చూపుతున్నాయి. స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అనేలా చేస్తున్నాయి..

ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటారు..1935లో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఆగస్టు మొదటి ఆదివారాన్ని జాతీయ స్నేహితుల రోజు గా ప్రకటించింది. 1935వ సంవత్సరం ఆగస్ట్ మొదటి శనివారం రోజున అమెరికా ప్రభుత్వం చేతిలో హతమైన తన స్నేహితుడిని మర్చిపోలేని మరో స్నేహితుడు ఆ తరువాత రోజైన ఆదివారంనాడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దీనికి చలించిపోయిన అమెరికా ప్రభుత్వం ఆగస్ట్ మొదటి ఆదివారాన్ని ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ డే గా ప్రకటించింది.

నాటి నుండి జాతీయ స్నేహితుల దినోత్సవం వార్షికోత్సవ వేడుకగా మారింది. ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర దేశాలు స్నేహితులకు ఒక రోజు అంకితమిచ్చే సంప్రదాయాన్ని స్వీకరించాయి. ఫ్రెండ్షిప్ డే రోజు స్నేహితులపై తమకున్న ప్రేమను వ్యక్తపరుస్తారు.. పువ్వులు, కార్డులు, బ్యాండ్లు వంటి ఫ్రెండ్షిప్ డే బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు, ఇదొక సాంప్రదాయంగా వస్తోంది.

స్నేహం అనేది ఒక మధురమైన అనుభూతి.. చిన్న పల్లల నుంచి ముసలి వాళ్ల వరకూ స్నేహితులు ఉండని వారు ఉండరు.. ప్రస్తుత కాలంలో ట్రెండ్ మారుతున్నా ఫ్రెండ్షిప్ డే ప్రాముఖ్యత మాత్రం తగ్గడం లేదు.. నిస్వార్థమైన స్నేహాన్ని ఆస్వాదిస్తున్న స్నేహితులు మరోసారి ఫ్రెండ్షిప్ డేకి గ్రాండ్ వెల్కం చెబుతున్నారు.. ఒకప్పుడు ఫ్రెండ్షిప్ డే రోజు గ్రీటింగ్ కార్డులతో శుభాకాంక్షలు చెప్పుకునే వారు.. ఇప్పుడు గ్రీటింగ్స్ చెప్పుకునే పద్దతి మారింది.. మెసేట్ రూపంలో శుభాకాంక్షలు చెప్పుకుంటూ తమ.. ఆనాటి అనుభూతులను, సరదాలను గుర్తు చేసుకుంటున్నారు..

నీ కథలన్నీ తెలిసినవాడు మంచి స్నేహితుడు.. ప్రతి కథలోనూ నీతోపాటే ఉండేవాడే బెస్ట్ ఫ్రెండ్.. ఇలాంటి స్నేహం చిన్నతనంనుంచే మొదలవుతుంది.. స్కూల్, కాలేజీ లో పిల్లల మధ్య మొదలైన కల్లాకపటం లేని స్నేహం.. చివరి శ్వాస విడిచే వరకూ కొనసాగుతుంది. ఆ బంధానికి హద్దులు ఉండవు.. ఏ విషయాన్నైనా పంచుకోవచ్చు.. బాధల్లో ఓదారుస్పుంది.. ఆపదలో అడ్డునిలుస్తుంది. స్నేహం గొప్పతనం వివరించడానికి మాటలు చాలవు.. ఎవరెన్ని రకాలుగా వర్ణించినా స్నేహం గొప్ప తనానికి నిర్వచనం పూర్తి కాదు.. అందుకే అన్నారు స్నేహమేరా జీవితం... స్నేహమేరా శాశ్వతం.. స్నేహానికి ఇంతకంటే గొప్ప నిర్వచనం ఏముంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories