Guntur: మంగళగిరి నియోజకవర్గంలోని 62 డివిజన్లలో ప్రారంభమైన ఎన్నికల పోలింగ్!

Guntur: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని 62 డివిజన్లలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఎన్నికల పోలింగ్. బరిలో 187 మంది అభ్యర్థులు, పోలీసుల భారీ బందోబస్తు.

MALLESHWAR RAO, MANGALAGIRI
Published on: 26 Nov 2026 8:45 AM IST
Guntur
X

Guntur: మంగళగిరి నియోజకవర్గంలోని 62 డివిజన్లలో ప్రారంభమైన ఎన్నికల పోలింగ్!

Guntur: మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో 62 డివిజన్లో ఎన్నికలు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 237711

పోలింగ్ కేంద్రాలు : 261

62డివిజన్లకు గాను మొత్తం 187 మంది అభ్యర్థులు పోటీ. టిడిపి : 49 , వైఎస్ఆర్సిపి : 53 , జనసేన :11 ,సిపిఎం: 06 సిపిఐ : 03 బిజెపి : ౦౨ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ :02 , బీసీవై : 02, బీఎస్పీ : 02 ఇండిపెండెంట్ : 49 కాంగ్రెస్ : 8 స్థానాలలో పోటీ చేస్తున్నారు.

మేయర్ స్థానానికి మొత్తం 8 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి మంగళగిరి నియోజకవర్గం పరిధిలో ప్రారంభమైన పోలింగ్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు మరియు పోలీసులు. కేవలం ఓటు హక్కు ఉన్నవారు మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పోలీసులు. ఓటు హక్కు లేని వారిని పోలింగ్ కేంద్రాల వద్ద ఉండవద్దు అంటూ హెచ్చరికలు జారీ.

MALLESHWAR RAO, MANGALAGIRI

MALLESHWAR RAO, MANGALAGIRI