బీఆర్ఎస్ పార్టీకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ZPచైర్మన్ రాజీనామా

ZP Chairman of Bhadradri Kothagudem District Resigned from BRS Party
x

బీఆర్ఎస్ పార్టీకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ZPచైర్మన్ రాజీనామా

Highlights

*ఇవాళ పొంగులేటితో పాటు కాంగ్రెస్‌లో చేరనున్న ZPచైర్మన్ కనకయ్య

Telangana: కొద్ది రోజులుగా బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ZP చైర్మన్ కనకయ్య పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. ఇవాళ ఖమ్మంలో జరగబోయే రాహుల్ సభలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ విధానాలు నచ్చకే తాను పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. తనతో పాటు ఒక ZPTC, 56 మంది సర్పంచ్‌లు, 26 మంది MPTCలు కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలిపారు.

కొద్ది రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ZP చైర్మన్ కొలం కనకయ్య పొంగులేటితో కలిసి పనిచేస్తున్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. పదవికి, పార్టీకి రాజీమానా చేయాలని డిమాండ్ చేశారు. అయితే తనపై అవిశ్వాస తీర్మానం పెట్టి తనను తొలగించాలని సవాల్ విసురుతూ వచ్చారు కనకయ్య. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories