Zero Shadow Day: నేటి మధ్యాహ్నం 12:12 నిమిషాలకు నీడ ఉండదు

Zero Shadow Day in Hyderabad
x

Zero Shadow Day: నేటి మధ్యాహ్నం 12:12 నిమిషాలకు నీడ ఉండదు 

Highlights

Zero Shadow Day: సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడడంవల్లే ఈ వింత అద్భుతం

Zero Shadow Day: ఈనెల 9న ఓ అద్బుతం జరగబోతోంది. ఆరోజున మీ నీడ మీకు కన్పించదు. అదేంటి మన నీడ మనకు కన్పించకపోవడం అనుకుంటున్నారా..? మీరు నమ్మినా..నమ్మకపోయినా..అది మాత్రం నిజం. అసలు ఈనెల 9న ఏం అద్బుతం జరగబోతోంది..? అది తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ.

జీరో షాడో డే...అంటే ఎండలో మనం నిల్చున్నా కూడా మన నీడ మనకు కన్పించదు. దీనినే జీరో షాడే అంటారు. అలాంటి అద్బుత దృశ్యం..ఈనెల 9న హైదరాబాద్ లో జరగబోతుంది. ఈ జీరో షాడో టైమ్‌లో ఏ వస్తువుపైన కానీ, మనిషిపైన కానీ సూర్యుడి కాంతి పడినా...నీడ మాత్రం అస్సలు కనిపించదు. దీనినే టెక్నికల్ భాషలో జెనిత్ పొజిషన్ అంటారు. దీని కారణంగానే జీరో షాడో డే ఏర్పడుతుంది. సాధారణంగా మనం ఎండలో నిలబడినప్పుడుకానీ..నడుస్తున్నప్పుడు గానీ మనపై సూర్యుడి కాంతి కిరణాలు పడడడంతో నీడ కనిపిస్తుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ ఈనెల 9న మధ్యాహ్నం సరిగ్గా 12.12 గంటలకు దాదాపు 2నిమిషాల పాటు మన నీడ మనకు కన్పించదు. ఆ సమయంలో హైదరాబాద్ నగరంలో సూర్య కిరణాలు నిట్ట నిలువుగా పడతాయని..అందుకే నీడ కన్పించదని BMబిర్లా సైన్స్ సెంటర్ అధికారులు చెప్తున్నారు.

ఈనెల 9న మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల సమయంలో ఎండలో 90 డిగ్రీల కోణంలో ఉంచిన ఏ వస్తువు నీడ కూడా రెండు నిమిషాల పాటు కనిపించదని సైంటిస్టులు చెప్తున్నారు. అలా 12.12 నుంచి 12.14 వరకు దీనిని గమనించవచ్చన్నారు. ఇలాంటి అరుదైన అద్బత దృశ్యాలు...ప్రతీ సంవత్సరం రెండుసార్లు మాత్రమే వస్తుందన్నారు. కర్కాటక, మకరరేఖల మధ్యనున్న ప్రాంతాల్లోనే ఇది కనిపిస్తుందని...జీరో షాడో టైమ్‌లో సూర్యుడి అక్షాంశం, మనిషి అక్షాంశం సమాంతరంగా ఉంటాయి. అంటే సూర్యుడి..కాంతి మనిషి పరిధిని దాటి పోలేదు. అందుకే నీడ పడదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈనెల 9నే కాకుండా ఆగస్టు 3న కూడా జీరో షాడో డే ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దాదాపు ఆ సమయంలో అన్ని ప్రాంతాల్లోనూ నీడ మాయం అవుతుందని అలాగే భువనేశ్వర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరులో ఈ జీరో షాడో డే తరచుగా కన్పిస్తుందని తెలిపారు. ఇదంతా రెప్ప పాటులోనే జరిగినప్పటికీ..దాని ప్రభావం మాత్రం దాదాపు నిముషం పాటు ఉంటుందన్నారు.

అయితే ఈమధ్య వాతావరణంలో అనూహ్యంగా మార్పులు సంభవిస్తు్న్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం సమ్మర్ సీజన్‌లో కూడా జోరుగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. వాతావరణం మబ్బులు పట్టి, చల్లగా ఉంటే సూర్యుడు కన్పించడని..అలాంటప్పుడు జీరో షాడో ఏర్పడే అవకాశం ఉండదన్నారు. సూర్యకిరణాలు పడితేనే జీరో షాడో అనేది ఏర్పడుతుందని..అలాంటి దృశ్యాన్ని చూడడానికి వీలుగా ఉంటుందన్నారు. జీరో షాడో అనేది కొన్నేళ్ల నుంచి ఏర్పడుతున్నా...ఈ విషయం చాలా మందికి తెలియదన్నారు. ఈ మధ్య కాలంలోనే దీని గురించి అందరికీ తెలుస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈనెల 9న ఏర్పడే జీరో షాడోను ప్రజలందరూ వీక్షించాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories