TS: కరెంట్ బిల్లు కష్టాలు.. వినియోగదారులకు అందని జీరో బిల్లు

Zero Current Bill Not Received By Consumers In Telangana
x

TS: కరెంట్ బిల్లు కష్టాలు.. వినియోగదారులకు అందని జీరో బిల్లు

Highlights

TS: అధికారుల తప్పిదంతో జీరో బిల్లు అందడం లేదని ఆరోపణలు

TS: తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న జీరో కరెంట్ బిల్లు కష్టాలు తెచ్చిపెడుతుంది. పలు ప్రాంతాల్లో వినియోగదారులకు జీరో బిల్లు లభించక పోవడంతో లబ్దిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో జీరో బిల్లు కోసం వినియోగదారులు మండల ప్రజాపరిషత్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూన్నారు. ప్రభుత్వం ఆదేశాలతో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని.

ఆన్ లైన్లో నమోద చేసినా జీరో బిల్లు వర్తించకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా 200 యూనిట్ల వరకు రాయితీ కల్పిస్తున్నట్టు చెబుతున్నా.. అధికారుల నిర్లక్ష్యంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రెండు వందల యూనిట్ల లోపు కరెంట్ వినియోగిస్తున్న వారికి జీరో బిల్లు అమలుచేయాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories