Khammam: రాజకీయాల్లో తొలి అడుగు వేస్తున్న- షర్మిల

Khammam: రాజకీయాల్లో తొలి అడుగు వేస్తున్న- షర్మిల
x

Khammam: రాజకీయాల్లో తొలి అడుగు వేస్తున్న- షర్మిల

Highlights

Khammam: తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపిస్తున్న వైఎస్ షర్మిల ఖమ్మం పట్టణంలో మొట్టమొదటి బహిరంగ సభ నిర్వహించారు.

Khammam: తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపిస్తున్న వైఎస్ షర్మిల ఖమ్మం పట్టణంలో మొట్టమొదటి బహిరంగ సభ నిర్వహించారు. తెలంగాణలో రాజన్న సంక్షేమ పాలన తిరిగి తీసుకురావాలని సంకల్పిస్తున్నామని షర్మిల అన్నారు. వైఎస్సార్‌ అడుగుజాడల్లో నడిచేందుకు రాజకీయాల్లో తన తొలి అడుగు వేస్తున్నానని.. రాజకీయ పార్టీ పెట్టబోతున్నానని ప్రకటించారు. వైఎస్‌ జయంతి (జులై 8)నాడు పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటించనున్నట్టు ఆమె స్పష్టంచేశారు. సరిగ్గా ఇదే రోజున సంక్షేమ పాలనకు పునాదులు వేసుకుంటూ వైఎస్సార్‌ ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభమైందని గుర్తుచేశారు. తెలంగాణ రాజకీయాల్లో ఆయన్ను తిరిగి ప్రతిష్ఠించబోతున్నామని చెప్పారు.

ఖమ్మం పట్టణంలో ఏర్పాటు చేసిన సంకల్ప సభలో వైఎస్ షర్మిల ప్రసంగంలో సీఎం కేసీఆర్ పైనా విమర్శలు గుప్పించారు. ఓవైపు గతంలో తన తండ్రి వైఎస్సార్ పాలన ఘనతలు చెబుతూ, ఇప్పుడు సీఎం కేసీఆర్ పాలనలో పరిస్థితి దిగజారిందని పేర్కొంటూ షర్మిల ప్రసంగం కొనసాగించారు. కేసీఆర్ పాలనలో అన్యాయాలను ప్రశ్నించడానికి మన పార్టీ అవసరం ఉందంటూ ఉద్ఘాటించారు. తెలంగాణలో తాము ఎందుకు పార్టీ పెడుతున్నారో షర్మిల సోదాహరణంగా వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories