Sangareddy: విషాదం.. సెల్‌టవర్‌పై యువకుడు ఆత్మహత్య

Youth Nagaraju Committed Suicide on the Cell Tower in Sangareddy
x

Sangareddy: విషాదం.. సెల్‌టవర్‌పై యువకుడు ఆత్మహత్య

Highlights

Sangareddy: సెల్‌టవర్‌పై కేబుళ్లతో ఉరివేసుకొని నాగరాజు ఆత్మహత్య

Sangareddy: సంగారెడ్డి జిల్లా జోగిపేటలో విషాదం చోటుచేసుకుంది. సెల్‌టవర్‌పై యువకుడు నాగరాజు ఆత్మహత్య చేసుకున్న ఘటన.. స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఓ స్క్రాప్‌ దుకాణంలో నాగరాజు చోరీకి పాల్పడ్డాడు. అయితే.. చోరీ విషయాన్ని స్క్రాప్‌ దుకాణం యజమానికి శేఖర్‌ అనే మరో యువకుడు చెప్పడంతో.. ఆగ్రహానికి గురైన నాగరాజు.. శేఖర్‌ను హత్య చేశాడు. అనంతరం.. శేఖర్‌ మృతదేహాన్ని చెరువులో పడేశాడు. గజ ఈతగాళ్ల సాయంతో శేఖర్‌ మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు.

దీంతో భయంతో సెల్‌టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు నాగరాజు. అదే సెల్‌టవర్‌పై కేబుళ్లతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నాగరాజు, శేఖర్‌ల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలో మృతుల కుటుంబసభ్యుల రోదనలతో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories