Suicide: ప్రియుడు మోసం చేశాడని పురుగులమందు తాగిన తేజశ్రీ

Young Woman Commits Suicide At Bellampalle
x

Suicide: ప్రియుడు మోసం చేశాడని పురుగులమందు తాగిన తేజశ్రీ

Highlights

Suicide: ఆత్మహత్యకు ముందు యువతి సెల్ఫీ వీడియో

Suicide: ప్రియుడు మోసం చేశాడని.. పురుగుల మందు తాగి ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకుంది... బెల్లంపల్లికి చెందిన 22 ఏళ్ల తేజశ్రీ, నెన్నెల మండలం లంబాడితాండకు చెందిన రాజ్ కుమార్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చేసరికి రాజ్ కుమార్ మొఖం చాటేశాడు. దీంతో మోసపోయానని గ్రహించి, ఆవేదనతో తేజశ్రీ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో కూడా తీసుకుంది... తనను రాజ్ కుమార్ నమ్మించి మోసం చేశాడని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది.

రెండు రోజులపాటు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తేజశ్రీ కన్నుమూసింది. తన కూతురి మరణానికి కారణమైన రాజకుమార్.. అతడి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని యువతి తల్లి పోలిసులను ఆశ్రయించింది. సూసైడ్ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories