YCP Telangana: తెలంగాణలో వైసీపీ దుకాణం బంద్ అయినట్లేనా?

Whether There is no YCP in Telangana
x

Telangana:(File Image)

Highlights

YCP Telangana: తెలంగాణలో వైసీపీ దుకాణం బంద్ అయినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Telangana: తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ జెండా పీకేసినట్టేనా? ఆ పార్టీని తెలంగాణలో విస్తరించే ఆలోచన అధిష్టానానికి లేదా? నిరాశతోనే తెలంగాణ వైసీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి రాజీనామా చేశారా? ఆ పార్టీలోని పరిణామాలు చూస్తే అలాగే కనిపిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ ఆవిర్భావం త‌ర్వాత తెలంగాణలో 2014 ఎన్నిక‌ల్లో ఒక ఎంపీ, మూడు ఎమ్మెల్యే స్థానాల‌ను గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు అనుకూలంగా మారిపోయింది. ఏపీలో ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు వ్య‌తిరేకంగా ఏ ఒక్క కార్య‌క్ర‌మం చేయ‌లేదు వైసీపీ

కేసీఆర్‌తో స‌న్నిహిత సంబంధాలు...

2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకొచ్చాక‌ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో స‌న్నిహిత సంబంధాల‌ను కొన‌సాగించ‌డం మొద‌లుపెట్టారు సీఎం జగన్. ఆ తర్వాత తెలంగాణలో వైసీపీ కార్యక్రమాలు పూర్తిగా ఆగిపోయాయి. వైసీపీ శ్రేణులు నాయకులు, కార్యకర్తలు ఇంటికే పరిమితమయ్యారు. తెలంగాణ‌లో ఇక వైసీపీ యాక్టివ్‌గా ఉండ‌ద‌ని ఎక్క‌డైనా అవ‌కాశాలు ఉంటే చూసుకొండంటూ గ‌త ఏడాది క్యాడర్ కు అధిష్టానం నుంచి సంకేతాలు అందాయి. దీంతొ కొందరు వైసీపీ నేతలు త‌మ‌కు న‌చ్చిన పార్టీలో వెళ్లిపోయారు. ఇటీవల తెలంగాణ‌లో వైఎస్ ష‌ర్మిల పెట్టబోతున్న పార్టీ వైసీపీ నేతలకు వేదికగా మారింది. వైసీపీలో కీల‌కంగా పనిచేసిన కొండా రాఘ‌వ‌రెడ్డి, పిట్టా రాంరెడ్డి లాంటి నాయ‌కులు ష‌ర్మిల మద్దతుదారులుగా మారారు. మరికొందరు షర్మిలా పెట్టబోతున్న పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.

వైసీపీని విస్తరించే ఆలోచన లేకపోవడంతో...

తెలంగాణలో వైసీపీని విస్తరించే ఆలోచన అధిష్టానానికి లేకపోవడంతో చివరకు తెలంగాణ‌ వైసీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు గ‌ట్టు శ్రీకాంత్‌రెడ్డి రాజీనామా చేశారు. ఓ జాతీయ పార్టీలో చేరి వచ్చే ఎన్నికల్లో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని తెలిపారు. తెలంగాణలో వైసీపీ స్తబ్దుగా ఉండడం, చివరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి రాజీనామా చేయడంతో తెలంగాణలో ఆ పార్టీ దుకాణం బంద్ అయినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories