Revanth Reddy: యాద్రాది కాదు.. యాదగిరిగుట్ట.. TTD తరహాలో టెంపుల్‌ బోర్డు..

Yadagirigutta Temple to Get TTD-Like Board
x

Revanth Reddy: యాద్రాది కాదు.. యాదగిరిగుట్ట.. TTD తరహాలో టెంపుల్‌ బోర్డు..

Highlights

Yadagirigutta Temple Board: యాదాద్రి ఆలయ అభివృద్ధిపై రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

Yadagirigutta Temple Board: యాదాద్రి ఆలయ అభివృద్ధిపై రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. యాదగిరి టెంపుల్ బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. TTD తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న..భూసేకరణ పూర్తిచేయాలన్నారు. ఆలయ పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని రేవంత్ ఆదేశించారు.

యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. టీటీడీ తరహాలో యాదగిరిగిటుట్ టెంపుల్ బోర్డు ఉండెలా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. టీటీడీ స్థాయిలో బోర్డుకు ప్రాధాన్యత ఉండేలా పూర్తి ఆద్యయనంతో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఇక నుంచి యాదాద్రి బదులుగా అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

యాదగిరిగుట్టలో గోశాలలో గో సంరక్షణకు ఒక ప్రత్యేక పాలసీని తీసుకు రావాలని అధికారులను సూచించారు. గో సంరంక్షణకు అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్నారు. యాదగిరిగుట్ట కొండపై గతంలో భక్తులు నిద్ర చేసేందుకు అవకాశం ఉండేదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కొండ్ర నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులను ఆదేశించారు.

విమాన గోపురానికి బంగారు తాపడం పనులు వేగవంతం చేయాలన్నారు. బ్రహ్మోత్సోవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలన్నారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్ లో ఉన్న భూసేకరణను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అసరమైన నిధులను మంజూరు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఆలయానికి సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మరో వారంరోజుల్లో పూర్తి వివరాలు, ప్రపోజల్స్ తో రావాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆలయానికి సంబంధించి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ పనులు, ఇతర అంశాలపై పూర్తిస్థాయి రిపోర్ట్ అందించాలని తేల్చి చెప్పిన సీఎం.

Show Full Article
Print Article
Next Story
More Stories