Women's Day Celebration: రేపు మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు

Womens Day Celebration: Casual Leave for Women Government Employees
x

ఇమేజ్ సోర్స్ : ది హన్స్ India

Highlights

Women's Day Celebration: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ సెలవు ప్రటించింది

Women's Day Celebration: రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ సీఎస్ సోమేశ్ కుమార్ పేరిట సాధారణ పరిపాలన శాఖ ఉద్యోగ సంక్షేమ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది.

1909 - 1910 ప్రాంతంలోనే ఈ మహిళా దినోత్సవ భావనకి అం కురార్పణం జరిగిందని చెప్పచ్చు. ఆ రోజున రాజకీయ, సామాజిక రంగాలలో మహిళలు సాధించిన ప్రగతిని అవలోకించుకుంటూ, భ విష్యత్తులో మరింత పురోగమనాన్ని, పురోభివద్ధిని సాధించేందుకు అ నుసరించాల్సిన పంథాలని, పద్ధతులని సమీక్షించుకుంటూ మహిళ లంతా ఒక్కటిగా తమ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కాంక్షిస్తూ ఎలుగెత్త డం అప్పటినుంచే మొదలయింది. అయితే అంతకు శతాబ్దం క్రితమే పురుషా'దిక్య ప్రపంచంలో మగ్గు తున్న మహిళా లోకం ఓటు హక్కు కావాలని ముక్తకంఠంతో నినదిం చిన 1848వ సంవత్సరం మహిళల హక్కుల ఉద్యమంలో మైలురా యి. ఎలిజబెత్‌ కాడీ స్టాన్‌టన్‌ రూపొందించిన ''డిక్లరేషన్‌ ఆఫ్‌ సెం టిమెంట్స్‌''ని న్యూయార్క్‌లో జరిగిన మహిళా హక్కుల సదస్సు ఆ మోదించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories