ఆ మాస్క్ లకు పెరుగుతున్న డిమాండ్.. 6 లక్షల మాస్కులమ్మి రూ.30లక్షల సంపాదన

women from Narayanpet Make Reusable, Ayurvedic Masks
x

Telangana: ఆ మాస్క్ లకు పెరుగుతున్న డిమాండ్.. 6 లక్షల మాస్కులమ్మి రూ.30లక్షల సంపాదన

Highlights

Telangana: ఇంటి నుంచి బయట అడుగుపెట్టే ముందు ఫోన్‌, బ్యాగు ఇలా అన్నీ ఉన్నాయా లేదా అని చూసుకునేవాళ్లు.

Telangana: ఇంటి నుంచి బయట అడుగుపెట్టే ముందు ఫోన్‌, బ్యాగు ఇలా అన్నీ ఉన్నాయా లేదా అని చూసుకునేవాళ్లు. మరి ఇప్పుడేమో కరోనా కాలం. వైరస్‌ భయం. దాంతో గడప దాటే ముందు మాస్కు వేసుకుంటున్నారు. అందుకుతగ్గట్టే మాస్కులు కూడా విరివిగా లభ్యమవుతున్నాయి. అయితే మందుల దుకాణాల్లో దొరికే సాధారణ మాస్కులు ఒకసారి వాడితే మళ్లీ వాడొద్దని చెబుతున్నారు నిపుణులు. ఎనిమిదిగంటల కన్నా ఎక్కువ సమయం వాడకూడదంటున్నారు. ఇప్పుడిదే తారక మంత్రం. దీనికి ఆయుర్వేద తంత్రాన్ని జతచేసి విలక్షణ రక్షణ కల్పిస్తున్నారు తెలంగాణలోని నారాయణపేట జిల్లా కలెక్టర్‌ హరిచందన.

కర్ఫ్యూ, లాక్ డౌన్ కారణంగా అందరు ఇళ్లకు పరిమితమైయ్యారు. పనులు లేక మహిళా సంఘాల సభ్యులు ఖాళీగా ఉన్నారు. వాళ్లకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన మాస్కులను తయారు చేయించి, వాళ్లకు ఉపాధి కల్పిస్తున్నారు. డీఆర్‌డీఓతో ఆర్థిక సాయం చేసి వాళ్లతో ఆ పని మొదలుపెట్టించారు. ఆమె ఇచ్చిన ప్రోత్సాహంతో రకరకాల మాస్కులను తయారుచేసి మహిళలు రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు ఆరు లక్షలకు పైగా మాస్కులు కుట్టి దాదాపు 30 లక్షల రూపాయల వరకు లాబాలను ఆర్జించారు. క్లాత్ మాస్కులు, ఆయుర్వేద మాస్కులు కుట్టి వాటిని ఆన్ లైన్ లో అమ్ముతున్నారు.

బాలీవుడ్ సెలబ్రిటీలు టబూ, ఫరాఖాన్ కూడా ఆన్లైన్ లో వాటిని కొనుక్కున్నారు. విజయ్ దేవరకొండ కూడా ఈ మాస్క్‌లు నచ్చి రౌడీ బ్రాం వెబ్ సైట్లో బ్రాండింగ్ చేశాడు. ప్రస్తుతం నారాయణపేటలో తయారైన ఆయుర్వేద మాస్క్ లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. రోజురోజు పెరుగుతున్న డిమాండ్ ను చూసిన మహిళలు కొత్త కొత్త డిజైన్లను తయారు చేశారు. పోచంపల్లి కాటన్, రంగురంగుల క్లాత్ లతో సరికొత్త డిజైన్లు కుట్టారు. కరోనా టైంలోనే కాకుండా మిగతా టైంలో కూడా పొల్యూషన్ నుంచి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేలా దాన్ని తయారుచేశారు. నారాయణపేట బ్రాండ్ పేరుతో ఈ మాస్కులను మార్కెటింగ్ చేసుకున్నారు. ఆన్లైన్ మార్కెటింగ్ మొదట్లో కొద్దిగా ఇబ్బందులు తెచ్చిపెట్టినా తర్వాత క్లిక్ అయ్యింది. దీంతో ఇప్పుడు నారాయణపేట మాస్క్ లకు బాగా పేరొచ్చింది.

ఈ క్లాత్ మాస్కులకే కాకుండా నారాయణపేటలో ఆయుర్వేద మాస్కులు కూడా ఎంతో పేరొందాయి. మహిళలు కుట్టిన మాస్కులను ఆయుర్వేద డాక్టర్లకు పంపుతారు. వాళ్లు కర్పూరం, వాము, పుదీనా, నీలగిరి ఆకు, లవంగ నూనెలు కలిపి తయారు చేసిన ఒక మిశ్రమంలో ముంచి వాటిని ఆరబెడతారు. అలా ఆయుర్వేద మాస్కులు తయారవుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories