Passports: ఇకపై పాస్ పోర్ట్ పొందడం మరింత సులువు.. వారం రోజుల్లోనే..!

Will Speed up Process of Issuing Passport Says Hyderabad Regional Passport Officer Snehaja
x

Passports: ఇకపై పాస్ పోర్ట్ పొందడం మరింత సులువు.. వారం రోజుల్లోనే..!

Highlights

Passports: పాస్ పోర్ట్ అపాయింట్ మెంట్ గడువు 6 నుంచి 8 రోజులకు కుదించినట్టు హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారిణి స్నేహజ చెప్పారు.

Passports: పాస్ పోర్ట్ అపాయింట్ మెంట్ గడువు 6 నుంచి 8 రోజులకు కుదించినట్టు హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారిణి స్నేహజ చెప్పారు.తన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.2023లో పాస్ పోర్ట్ అపాయింట్ కోసం 22 రోజుల సమయం పట్టేదని ఆమె గుర్తు చేశారు.వరంగల్ లో అత్యధికంగా రోజుకు 130, మిగతా కేంద్రాల్లో 90 చొప్పున దరఖాస్తులు పరిశీలించామని ఆమె తెలిపారు.తమ కార్యాలయం పరిధిలో ఐదు పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు, 14 పోస్టాఫీస్ పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయని ఆమె వివరించారు. గత ఏడాది సగటున రోజుకు 4,200 అప్లికేషన్లు పరిశీలించామని ఆమె చెప్పారు. ప్రతి గురువారం నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రజల నుంచి అనేక సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయని ఆమె అన్నారు.మెయిల్స్ ద్వారా 10 వేల మంది సమస్యలను పరిష్కరించిన విషయాన్ని అధికారులు చెప్పారు. గత ఏడాది 9.02 లక్షల దరఖాస్తులను పరిష్కరించామన్నారు.

వారం రోజుల్లోనే పాస్ పోర్టుల జారీ

పాస్ పోర్టు జారీకి ఐదు నుంచి వారం రోజుల సమయం తీసుకుంటున్నామని స్నేహజ చెప్పారు. అయితే పోలీస్ విచారణ సమయాన్ని ఆమె ప్రస్తావించారు.పోలీస్ శాఖ నుంచి విచారణ పూర్తికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసి పాస్ పోర్టు అధికారులకు పంపుతారు. దాని ఆధారంగా పాస్ పోర్టులు జారీ చేస్తారు..

హైదరాబాద్ లో అటెస్టేషన్, అపోస్టిల్ సౌకర్యం

విదేశాలకు వెళ్లేవారు ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో భాగంగా ధృవీకరణ పత్రాల సరైనవేనని సర్టిఫికేషన్ కోసం అటెస్టేషన్, అపోస్టిల్ చేయిస్తారు. అయితే దీని కోసం దిల్లీకి వెళ్తారు. అయితే ఇక దీని కోసం దిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు. తమ కార్యాలయంలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. సెక్రటేరియట్ లోని జీఏడీకి దరఖాస్తు చేసుకుంటే ఆ పత్రాలను పరిశీలించి మరో ఏజెన్సీకి అప్పగిస్తారు. ఆ ఏజెన్సీ నుంచి తమ వద్దకు ఈ పత్రాలు వస్తాయని స్నేహజ వివరించారు. తమ కార్యాలయంలో నిబంధనల మేరకు వాటిని పరిశీలించి అటెస్టేషన్, అపోస్టిల్ చేసి స్టిక్కర్ తో పాటు స్టాంప్ వేస్తామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories