Formula E Car Race: ఫార్ములా ఈ-కార్ రేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారా..? బీఆర్ఎస్ వర్గాల్లో నెలకొన్న టెన్షన్..

Will KTR be Arrested in the Formula E Car Race
x

Formula E Car Race: ఫార్ములా ఈ-కార్ రేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారా..? బీఆర్ఎస్ వర్గాల్లో నెలకొన్న టెన్షన్..

Highlights

Formula E Race: కేటీఆర్‌కు ఉచ్చు బిగుస్తున్నదా..? అరెస్ట్ తప్పదా...? కేటీఆర్ అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏంటి..? పార్టీని ఎవరు నడపాలి..?

Formula E Race: కేటీఆర్‌కు ఉచ్చు బిగుస్తున్నదా..? అరెస్ట్ తప్పదా...? కేటీఆర్ అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి ఏంటి..? పార్టీని ఎవరు నడపాలి..? కేటీఆర్ అరెస్టయితే.. గులాబీ బాస్ కేసీఆర్ జనంలోకి వస్తారా..? ఇలా.. అనేక ప్రశ్నలతో బీఆర్‌ఎస్ క్యాడర్‌లో అయోమయం నెలకొన్నదట.. దిక్కుతోచక... దిగులు పడుతున్న గులాబీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు భరోసా ఇచ్చే రథసారధి ఎవరనే చర్చ జరుగుతోందట ఆ పార్టీలో.. ఇంతకూ గులాబీ పార్టీ పగ్గాలు చేతబట్టి... ముందుకు వెళ్లే నాయకుడు ఎవరు..? బీఆర్ఎస్ నేతల్లో జరుగుతున్న చర్చ ఏంటి.. ?

అధికారం కోల్పోయి కష్టాలు పడుతున్న బీఆర్ఎస్ పార్టీ

అధికారం కోల్పోయి కష్టాలు పడుతున్న బీఆర్‌ఎస్ పార్టీకి మరో పెద్ద కష్టమే వచ్చి పడింది. ఫార్మూలా ఈ కార్ రేసు రూపంలో వచ్చిన ఆ ఇబ్బందులకు కేటీఆర్‌తో సహా పార్టీ నేతలు దిక్కుతోచక తికమక పడుతున్నారట... ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి ఉందట పార్టీ... ఫార్ములా ఈ రేస్‌ కేసు మాజీ మంత్రి కేటీఆర్‌ మెడకు చుట్టుకుంటే పరిస్థితి ఏంటి..? ఈ కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు ఇప్పటికే గవర్నర్‌ నుంచి అనుమతి వచ్చింది. ఇప్పుడు ఈ వ్యవహారం అంతా ఏసీబీకి చేతికి చేరింది. జనవరి 7న విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది.. కేసులో ఇన్ వాల్వ్ అయిన అధికారి అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 2న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే అధికారులు విచారణలో తెలిపిన విషయాల ఆధారంగానే కేటీఆర్‌ను అరెస్టు చేస్తారనే సందిగ్ధత నెలకొంది.

మొదట ఇచ్చిన నోటీసులకు ఈనెల 7న విచారణ

ఏసీబీ దర్యాప్తులో భాగంగా తొలుత కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చింది.. కనుక ఈనెల 7న విచారణకు పిలిచి... ఆ తర్వాత ఆయనను అరెస్టు చేసే అవకాశం లేకపోలేదని పొలిటికల్ సర్కిల్‌లో పేద్ద చర్చే జరుగుతున్నది. ఫార్ములా ఈ-కారు రేసు పేరిట రెండు విడతలుగా దేశం నుంచి విదేశాలకు పెద్దమొత్తంలో డబ్బులు తరలి వెళ్లాయని అక్కడి నుంచి తిరిగి ఎక్కడికి వెళ్లాయనే దానిపై ఏసీబీ లోతుగా విచారణ చేయనుందట అలా విదేశాలకు వెళ్లిన డబ్బులకు సంబంధించి ఆర్‌బీఐ అనుమతి ఉందా..? లేదా..? అనే అంశాలపై సైతం కేటీఆర్‌ను వివరణ అడిగే అవకాశం ఉందట.

న్యాయపరంగా ఎదుర్కొంటానంటున్నారు కేటీఆర్

ఫార్మూలా ఈ కార్ రేసు కేసు విషయంలో కేటీఆర్, పార్టీ నేతలు కేసును న్యాయపరంగా ఎదుర్కొంటామని ధైర్యంగా చెబుతున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితిల్లో ఈ కేసులో కేటీఆర్‌ను జైలుకు పంపాలని పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసు విషయంలో మొదటి నుంచీ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ కోర్టును ఆశ్రయించడంతో ఈనెల 31వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని చెప్పింది కోర్టు కానీ విచారణ చేసుకోవచ్చని తెలిపింది. విచారణకు సహకరించాలని కేటీఆర్‌కు సూచించింది కోర్టు.

నేతల గుండెల్లో భయం ప్రారంభం

అయితే ఇక్కడే.. పార్టీ నేతల గుండెల్లో భయం ప్రారంభమైందట... విచారణ పేరుతో కేటీఆర్‌ను ఏసీబీ అరెస్ట్ చేస్తే పార్టీ పరిస్థితి ఏంటనేది నేతల్లో భయం నెలకొన్నదట ప్రస్తుతం కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ప్రస్తుతం అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్‌కు పరిమితం అయి పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు.. కేసీఆర్ పార్టీ నేతలకు ఆదేశాలు, సూచనలు చేయవచ్చు కానీ... నేరుగా ప్రజాక్షేత్రంలోకి ఇప్పుడే వస్తారా...? లేదా...? అనే ప్రశ్న తలెత్తుతోంది... కేసీఆర్ తర్వాత పార్టీని ఎవరు ముందుకు నడుపుతారన్న చర్చ జరుగుతుంది.

హరీశ్‌రావు, కవితకు కేసీఆర్ ఆదేశాలు ఇస్తారు

కేటీఆర్ అరెస్ట్ అయితే హరీష్ రావు, కవితతోపాటు పార్టీ నేతలు కేసీఆర్ ఆదేశాలతో పార్టీని ముందుకు తీసుకెళ్లనున్నారట... కానీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జైలుకు వెళ్తే.. పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొనే అవకాశం ఉంది.. ఇప్పటికే పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు బీఆర్‌ఎస్ గెలుచుకుంటుందని నేతలు భావిస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు ప్రతి రోజూ ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉన్నారు. క్యాడర్ కూడా పార్టీలో ఉంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కాగా.. కార్ రేస్‌లో కేటీఆర్ అరెస్ట్ అయితే పార్టీని ముందుండి నడిపే నాయకుడు ఎవరన్న చర్చ జరుగుతుంది.

బీఆర్ఎస్ పార్టీకి మరిన్ని కష్టాలు తప్పవు

మొత్తానికి కేటీఆర్ అరెస్ట్ అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి మరిన్ని కష్టాలు తప్పవనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా... ఫ్యూచర్‌లో గులాబీ పార్టీని ఎవరు నడిపిస్తారనే సంక్షోభం నెలకొన్నది. కేటీఆర్ అరెస్టు.. పార్టీని ఏ తీరాలకు చేర్చుతుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories