బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.. ఇంతకీ అఖిలప్రియకు బెయిల్ వస్తుందా ?

Bhuma Akhila Priya
x
Highlights

సంచలనంగా మారిన బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇంతకీ ఆమెకు బెయిల్ వస్తుందా ?...

సంచలనంగా మారిన బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇంతకీ ఆమెకు బెయిల్ వస్తుందా ? ఆరోగ్యప‌రిస్ధితులను దృష్టిలో పెట్టుకొని మంజూరు చేయాల‌న్న లాయర్ల వాదనతో ధర్మాసనం ఏకీభవిస్తుందా ? లేదంటే పోలీసుల కస్టడీకి ఇస్తుందా ? అసలు అఖిలప్రియ హెల్త్ కండిషన్ ఎలా ఉంది. సోమవారం పోలీసులు ఎలాంటి నివేదికను సమర్పించబోతున్నారు ?

బోయిన్‌పల్లి కిడ్నాప్ వ్యవహారం మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఏవన్‌గా అఖిలప్రియ ఏ2గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ3గా భార్గవ్ రామ్ పేర్లను చేర్చారు పోలీసులు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న అఖిలప్రియ ఆరోగ్య పరిస్థితులు సరిగాలేవని గర్భవతి కావడం, ఫిట్స్ వంటి ఆరోగ్య సమస్యలు ఉండడంతో బెయిల్ మంజూరు చేయాలని లాయర్లు సికింద్రాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అటు పోలీసుల వాదనలు కూడా విన్న న్యాయస్థానం అఖిల హెల్త్ రిపోర్ట్‌ స‌మ‌ర్పించాలని అధికారుల‌కు ఆదేశించింది.

కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఉస్మానియా ఆసుపత్రిలో అఖిలప్రియకు వైద్యపరీక్షలు నిర్వహించారు అధికారులు. సిటీ స్కాన్, అల్ట్రా సౌండ్ స్కాన్‌తో పాటు ఇత‌ర వైద్యప‌రీక్షలు నిర్వహించనున్నారు. ఐతే అఖిలప్రియకు ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్యలు లేవ‌ని పరీక్షల్లో తేలినట్లుగా తెలుస్తోంది. కోర్టులో మాత్రం ఫిట్స్, ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్యల‌తో ఆమె బాధపడుతున్నారని మెరుగైన వైద్యం కోసం బెయిల్ మంజూరు చేయాల‌ని లాయర్లు వాదించారు. ఐతే హెల్త్ విషయంలో క్లీన్ చిట్ రావడంతో బెయిల్ వ్యవహారంపై సోమవారం ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలో కనిపిస్తోంది.

ఇక అటు అఖిలప్రియను ఏడు రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఎట్టి ప‌రిస్ధితుల్లో ఆమెకు బెయిల్ మంజూరు చేయొద్దని అఖిలప్రియ బ‌య‌ట‌కు వ‌స్తే సాక్ష్యుల‌ను ప్రభావితం చేయడంతో పాటు కేసు కూడా తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఇక అటు ఈ కేసులో ఏ3గా ఉన్న అఖిలప్రియ భ‌ర్త భార్గర్ రామ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇలా ఓ వైపు బెయిల్ మ‌రోవైపు కస్టడీ రెండు పిటిషన్లపై వాదనలు సోమవారం జరగనున్నాయ్. న్యాయస్థానం తీర్పు ఎలా ఉండబోతుందని ఏం జరగబోతుందన్న టెన్షన్ కంటిన్యూ అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories