సీఎం కేసీఆర్‌ పెట్టబోతున్న చెక్ ఏంటి.. సిరికొండను త్వరలో కేబినెట్‌ బెర్త్‌ ఎక్కిస్తారా?

Will CM KCR Take Madhusudhana Chary Into Cabinet
x

సీఎం కేసీఆర్‌ పెట్టబోతున్న చెక్ ఏంటి.. సిరికొండను త్వరలో కేబినెట్‌ బెర్త్‌ ఎక్కిస్తారా?

Highlights

Madhusudhana Chary: తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమకారులకు మంచి రోజులు రాబోతున్నాయా?

Madhusudhana Chary: తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమకారులకు మంచి రోజులు రాబోతున్నాయా? అన్యాయం జరుగుతోంది అందలమెక్కించడం లేదన్న వాదనకు చెక్‌ పడబోతోందా? టీఆర్ఎస్‌ పార్టీలో, ప్రభుత్వంలో ఉద్యమకారులను పట్టించుకోవడం లేదన్న అపవాదను ఇక చెరపేయబోతున్నారా? ఇప్పటికే నామినేటెడ్‌ పోస్టుల్లో ఉద్యమకారులను అకామిడేట్‌ చేసిన అధినేత మరిన్ని పోస్టులు ఇప్పించి వారితో బెస్ట్‌ అనిపించుకోబోతున్నారా? అందులో భాగంగానే తాజాగా ఎమ్మెల్సీగా నామినేట్‌ చేసిన సిరికొండ మధుసూదనచారిని కేబినెట్‌కు ప్రమోట్‌ చేయబోతున్నారా? కారు పార్టీలో అసంతృప్తులకు కమలం పార్టీ గాలం వేస్తుందన్న ప్రచారాల మధ్య అధినేత ఆలోచన ఏంటి? ఆయన నిర్ణయమేంటి?

తెలంగాణ ఉద్యమంలో కృషి ఎవరిది, కుర్చీ ఎవరికి అన్న అపవాదును టీఆర్ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెక్‌ పెట్టబోతున్నారన్న చర్చ మొదలైంది. త్యాగాల బాటలో సాగిన తెలంగాణ ఉద్యమాన్ని భుజానికెత్తుకొని నడిపిస్తే చివరకు మిగిలిందేమిటన్న ఉద్యమకారుల అసంతృప్తులను చల్లార్చేందుకు గులాబీ బాస్‌ సరికొత్త ఆలోచన చేస్తున్నారట. ఉద్యమకారుల పంట పండించేందుకు రెడీ అవుతున్నారట. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని కొందరు నేతలే అందలం ఎక్కుతున్నారు వారినే అందలం ఎక్కిస్తున్నారన్న ప్రతిపక్షాల ప్రచారానికి బ్రేకులు వేయబోతున్నారట.

ఇందుకు పార్టీ శ్రేణులు ఉదాహరణలు కూడా చూపెడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ తొలి స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి గురించిన ఓ కొత్త ప్రస్తావనను తెరపైకి తెస్తున్నారు. టీఆర్ఎస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి అధినేత అడుగులో అడుగులు వేసిన సిరికొండను త్వరలో కేబినెట్‌ బెర్త్‌ ఎక్కిస్తారన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్‌గా ఉన్న చారి గులాబీ బాస్‌ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడమే కాకుండా ఉద్యమకారులను ఏక తాటిపై నడిపించేందుకు తన వంతు పాత్ర పోషించారన్న నమ్మకంతో ఉన్న చారిని ఎలాగైన తన మంత్రివర్గ సహచరుడిగా తీసుకునే అవకాశాలు లేకపోలేదని గులాబీ క్యాంప్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అదీగాక, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఉద్యమకారులను కేసీఆర్ పట్టించుకోవడం లేదని విపక్షాలు ముక్తకంఠంతో నెగిటివ్‌ ప్రచారం చేస్తుండటాన్ని గులాబీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుందట. సిరికొండను గనుక కేబినెట్‌లోకి తీసుకుంటే ఉద్యమకారులకు మంచి రోజులు వచ్చాయని చెప్పుకునే వీలుందని, వారికి పెద్ద పీట వేస్తున్నామని ప్రచారం చేసుకోవచ్చని గులాబీ క్యాంప్‌ ఆలోచిస్తోందట. అంతేగాకుండా, టీఆర్ఎస్‌లో ఉన్న అసంతృప్తులకు, ఉద్యమకారులకు ఇటు బీజేపీ, అటు గాలం వేస్తుండటాన్ని కూడా అడ్డుకోవచ్చని అనుకుంటుందన్న చర్చ జరుగుతోంది. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్న మధుసూదనచారికి, ఉద్యమకారులతో మంచి సంబంధాలు ఉండటంతో పక్క చూపులు చూడకుండా ఆయన బాధ్యత తీసుకుంటాడని, ఆ బాధ్యతను సిరికొండ భుజాన పెట్టొచ్చని అధినేత ఆలోచిస్తున్నట్టు సమాచారం.

సిరికొండ మధుసూదనచారిని అందలం ఎక్కించే క్రమంలోనే భాగంగా ఉద్యమకారులుగా తమకు అన్యాయం జరుగుతుందని భావిస్తున్న ముగ్గురు నాయకులను నామినేటెడ్‌ పోస్టులకు ప్రమోట్ చేశారన్నది గులాబీ పార్టీలో జరుగుతున్న ఒక చర్చ. తెలంగాణ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మన్నె కిషాంక్‌ను నియమించినా తెలంగాణ మెడికల్‌ సర్వీస్‌‌కు ఉద్యమకారుడు ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను ఛైర్మన్‌గా ప్రకటించినా సాయిచందర్‌ను వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా ప్రమోట్ చేసినా ఇదంతా వ్యూహంలో భాగమేనన్న టాక్‌ వినిపిస్తోంది. ఉద్యోగాలు, ఉన్నత విద్య, ఉపాధి కోసం మొదలైన ఉద్యమంలో పాల్గొన్న యువ నాయకుత్వానికి పట్టం కట్టేందుకు కేసీఆర్‌ ఈ తరహా ఆలోచన చేసి ఉంటారన్న చర్చ జరుగుతోంది.

వేలాది మంది కలిసి చేసిన తెలంగాణ మలి దశ ఉద్యమ నిర్మాణ సమయాన, ఎన్నో కష్టాలు పడి, ఎన్నో తరాలు త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ ఉద్యమకారుల చేతుల్లో లేకుండా పోయిందన్న విపక్షాల కౌంటర్‌కు ఎక్స్‌లెంట్‌ కౌంటర్‌ ఇచ్చేందుకు కేసీఆర్‌ ఖతర్నాక్‌ ప్లాన్‌ చేస్తున్నారని గులాబీ కార్యకర్తలు అనుకుంటున్నారు. టీఆర్ఎస్‌ పార్టీలో, ప్రభుత్వంలో ఉద్యమకారులకు స్థానం లేకుండా పోయిందన్న ప్రతిపక్షాల ప్రచారానికి చెక్‌ పెట్టడం ఖాయమని వారంటున్నారు. మరి ఉద్యమకారుల విషయంలో కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలు ఏ మేరకు కలసి వస్తాయో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories