గద్వాల జేజమ్మ గురిపెట్టిన లక్ష్యమేది?

గద్వాల జేజమ్మ గురిపెట్టిన లక్ష్యమేది?
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌లో ఫైర్‌‌‌ బ్రాండ్‌గా ఒక వెలుగు వెలిగారు జేజమ్మ కాషాయతీర్థం పుచ్చుకుని సైలెంటయ్యారు. ఎన్నికలకు కాస్త ముందు, కమలం వాకిట్లో కుడికాలు...

తెలంగాణ కాంగ్రెస్‌లో ఫైర్‌‌‌ బ్రాండ్‌గా ఒక వెలుగు వెలిగారు జేజమ్మ కాషాయతీర్థం పుచ్చుకుని సైలెంటయ్యారు. ఎన్నికలకు కాస్త ముందు, కమలం వాకిట్లో కుడికాలు పెట్టి వుంటే, గద్వాల రాణి యోగమే మారిపోయేదేమో. కానీ లాస్ట్‌ మినిట్‌లో చేరినా సెకండ్‌ ప్లేస్‌తో సత్తా చాటానని చెప్పుకుంటున్నారామె. అయితే ఇప్పుడు ఆ గద్వాల రారాణి బీజేపీలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారట. తెలంగాణలో పాగా వేయాలని స్కెచ్చేస్తున్న బీజేపీకి, ఆయుధమయ్యేందుకు సిద్దంగా ఉన్నారట. రానున్న తెలంగాణ రణక్షేత్రంలో కాషాయ సేనానిగా కదంతొక్కుతానంటున్నారట. మరి జేజమ్మను కాషాయ అధిష్టానం గుర్తిస్తుందా? గద్వాలను ఏలిన రాణి, తన లక్ష్యాన్ని సాధిస్తారా?

ఒకప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు డీకే అరుణ. ఎమ్మెల్యేగా ఉన్నన్నాళ్లు అధికార టిఆర్ఎస్‌పై చెలరేగిపోయారు. అయితే లోక్‌సభ ఎన్నికల నాటికి పార్లమెంటు సీటు కోసం హస్తం పార్టీలో ఫైట్ చేసి, చివరకు గ్రూపు రాజకీయాలతో టికెట్ పొందలేకపోయారు. దీంతో కాంగ్రెస్‌తో దశాబ్దాల బంధాన్ని విడిచిపెట్టి, భారతీయ జనతా పార్టీ గూటికి చేరారు.

డీకే అరుణ. ఇంట్రడక్షన్‌ అవసరంలేని నాయకురాలు. పార్లమెంటు ఎన్నికల ముందు కమలం పార్టీలో చేరి, లోక్‌సభ పోరులో రెండోస్థానంలో నిలిచి, తన పట్టును నిరూపించుకున్నార వుమన్ లీడర్. పార్లమెంటు ఎన్నికల కంటే కాస్త ముందుగా చేరినా, మోడీ ప్రభుత్వంలో ఉండే ఛాన్సుండేదని ఇప్పటికీ చెబుతారు గద్వాల జేజమ్మ. పార్లమెంట్‌ సీటు చేజారినా మరో లక్ష్యంపై గురిపెట్టారు డీకే అరుణ.

బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్‌ అండాదండలతో బీజేపీలో మరింత క్రియాశీలకంగా పని చేయాలని భావిస్తున్నారు డీకే అరుణ. పార్టీలో చేరే ముందే, మంచి భవిష‌్యత్తు ఉంటుందని రాంమాధవ్ హామి కూడా ఇచ్చారట. తెలంగాణలో బీజేపీ బలపడాలంటే, సొంతపార్టీలో పాతుకుపోయిన నేతలను కాకుండా బయట నుంచి వచ్చిన వారికి పార్టీ పగ్గాలు అప్పగించాలన్న చర్చ కూడ పార్టీలో జరుగుతోంది. అదే జరిగితే మొదటి లిస్టులో మాజి మంత్రి డికే అరుణ పేరు అధిష్టానం పరిశీలించడం ఖాయంగా కనిపిస్తోంది.

బిజేపి ట్రబుల్ షూటర్ రాంమాధవ్, ఇప్పటికే తెలంగాణపై ఫోకస్ పెట్టారు. ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు, మరో మాజీ ఎంపీతో పాటు కీలక నేతలకు గాలమేస్తున్నారు. రాంమాధవ్‌ స్టేట్‌పై మరింత దృష్టిపెడితే, తెలంగాణ పార్టీ బాధ్యతల విషయంలో డీకే అరుణ పేరునే బలంగా ప్రతిపాదించే అవకాశముందని తెలుస్తోంది. డీకే అరుణ పేరును పరిశలించడం వెనక అనేక సామాజిక సమీకరణాలు కూడా ఉన్నాయి.

తెలంగాణలో కాంగ్రెస్‌ను రీప్లేస్ చేయాలనుకుంటోంది బీజేపీ. కాంగ్రెస్‌ను రీప్లేస్ చేయడమంటే, రెడ్డి వర్గాన్ని తమవైపు తిప్పుకోవడమే. ఈ వర్గంలో కీలక నాయకులందర్నీ ఆకట్టుకునేందుకు ఢిల్లీ నంచే జోరుగా ప్రయత్నలు సాగుతున్నాయి. డీకే అరుణ కూడా రెడ్డి సామాజికవర్గమే. దీనికి తోడు కేంద్రంలో పార్టీ అధికారంలో ఉండటం మరింత కలిసి వస్తుంది. దీనితోపాటు అదనంగా కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్ నేతలందరితోనూ ఆమె నేరుగా మాట్లాడే ఛాన్సుంది. అక్కడ అసంతృప్తిగా ఉన్న నేతలను బిజేపి గూటికి చేర్చడంలో ఆమె కీలక పాత్ర పోషించడం ఖాయం. టిఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించడంలో దిట్ట. టిఆర్ఎస్‌‌ను టార్గెట్ చేసి పార్టీని లీడ్ చేస్తే తెలంగాణలో పార్టీ బలపడటం పెద్ద కష్టం కాదన్న అంచనాలో వుంది బీజేపీ.

ఇలా రకరకాల సమీకరణలతో గద్వాల జేజమ్మ పేరును పరిశీలిస్తున్నారు కాషాయ పెద్దలు. ప్రస్తుతమున్న లక్ష్మణ్‌ వారసులుగా కొత్తవారికి అవకాశమిస్తే, మొదటి వరుసలో జేజమ్మపేరు ఉండడం ఖాయమనే భావన పార్టీలో ఉంది.

ఒక వేళ జాతీయపార్టీ పార్టీలో సీనియర్లకే పెద్దపీట వేయాల్సి వచ్చినా డీకేకు కేంద్రంలో నామినేటెడ్ పోస్టుతో అకామిడేట్ చేయొచ్చనే చర్చ కూడ ఉంది. మరి పార్టీ జేజమ్మ సేవలను ఏ విధంగా వినియోగించుకుంటుంది ఆరెస్సెస్ నేపథ్యమున్నవారికే ఇవ్వాలని ఇతర బీజేపీ నేతలు అడ్డుతగులుతారా చూడాలి, తెలంగాణలో నాలుగు సీట్లు కొల్లగొట్టి, ఇక కాంగ్రెస్‌ను రీప్లేస్ చేయాలని వ్యూహాలు వేస్తున్న బీజేపీ అడుగులు ఎటుపడతాయో రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పీఠంపై కూర్చునేందుకు జేజమ్మ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళతారో.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories